Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నా చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. మొదటినుంచి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను ఎన్నుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా మొదలైనప్పటినుంచి ప్రతి సిట్టింగ్ లోనూ థమన్ కనిపిస్తూనే ఉన్నాడు. ఇక ఈ మధ్య రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కు కూడా థమన్ బీభత్సమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించాడు. ఇక తాజాగా థమన్ గురించి నెట్టింట ఒక వార్త చక్కర్లు కొడుతోంది.. ఈ సినిమా నుంచి థమన్ ను తొలగించినట్లు చెప్పుకొస్తున్నారు. అతని డేట్స్ అడ్జెస్ట్ అవ్వక అని కొందరు.. థమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ కు నచ్చలేదని కొందరు చెప్పుకొస్తున్నారు. మరికొందరు మహేష్ తో థమన్ కు విబేధాలు అని కూడా చెప్పుకొస్తున్నారు. దీనివల్లనే థమన్ ను సినిమా నుంచి తొలగించారని వార్తలు వస్తున్నాయి.
Malli Pelli: నరేష్- పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ ఓటిటీలోకి వచ్చేస్తోంది
ఇక థమన్ ప్లేస్ ను కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరుధ్ రవిచంద్రన్, జీవీ పప్రకాష్ కుమార్ రీప్లేస్ చేయడానికి పోటీపడుతున్నారని చెప్పుకొస్తున్నారు. ఎక్కువ అనిరుధ్ పేరునే వినిపిస్తోంది. ఇక వీరిద్దరికి తెలుగు సినిమాలు కొత్తేమి కాదు. దీంతో ఎవరు ఇచ్చినా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారని చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క థమన్ ఇచ్చే మాస్ బీజీఎమ్ మిస్ అవుతామని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.