ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్లు ఇప్పుడు కుర్ర హీరోలకు అక్కలుగా, చెల్లెళ్ళు గా మారిపోతున్నారు. ఇప్పటికే ఈ కేటగిరీలోకి చేరిపోయింది భూమిక. ఖుషిలో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ భామ అప్పటినుంచి కుర్రాళ్ళ గుండెల్లో మధు లానే గుర్తుండిపోయింది. ఇక కెరీర్ కొనసాగుతున్న క్రమంలోనే యోగా గురువు భరత్ ఠాకూర్ ని వివాహమాడి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇటీవలే అమ్మడు రీ ఎంట్రీ ఇస్తోంది. కుర్ర హీరోలు నాని, నాగ చైతన్య లాంటి వారికీ అక్కగా , వదినగా మారి కెరీర్ ని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇక ఎలాంటి సమయంలో ఎలాంటి ఛాన్స్ పోగొట్టుకూడదని గ్లామర్ గేట్లు కూడా ఎత్తేస్తుంది. ఇటీవల భూమిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఎర్రటి గౌన్ లో.. ఎద అందాలను ఎరగా వేసి పవన్ హీరోయిన్ అదరగొట్టేసింది. ఇక ఈ ఫోటోషూట్లతో తాను కూడా ఎలాంటి పాత్రలకైనా సిద్దమే అన్న హింట్ ఇస్తుందా..? అంటే నిజమే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.
ఇక రీ ఎంట్రీ కోసం తపన పడుతున్న మరో భామ మీరా జాస్మిన్. ఈమె కూడా పవన్ హీరోయిన్ అనే చెప్పాలి. గుడుంబా శంకర్ సినిమాలో చిట్టి నడుమునే చూస్తున్నా అంటూ పవన్ తో స్టెప్పులేసి ఈ భామ పెళ్లి తరవాత కనుమరుగైపోయిన సంగతి తెల్సిందే. సంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే ఈ భామ కూడా అవకాశాల కోసం అందాల ఆరబోతనే నమ్ముకుంది. వరుస ఫోటోషూట్లతో హీట్ ఎక్కిస్తుంది. ఇక ఈ ఇద్దరు హీరోయిన్లే కాకుండా చాలామంది హీరోయిన్లు ఇలా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఇలా అందాలు ఆరబోయడం వల వీరికి అవకాశాలు వస్తాయా..? లేదా..? అని చూడాలి.