Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఓటీటీ రంగంలోనే వ్యూయర్షిప్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మొదటి రెండు సీజన్ల భారీ విజయం తర్వాత, ఇప్పుడు అంతకు మించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఎంబీ (AMB) సినిమాస్‌లో “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ సెలబ్రిటీ ప్రీమియర్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. టాలీవుడ్ స్టార్స్, క్రియేటర్ల రాకతో ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్ ఫుల్ జోష్‌గా సాగింది.
ఈ ప్రత్యేక స్క్రీనింగ్‌కు టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, బిగ్ బాస్ విన్నర్స్ వీజే సన్నీ, కళ్యాణ్ పడాలా(బిగ్ బాస్ 9)తో పాటు చైతన్య రావు, కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, కిరీటి దామరాజు, ముక్కు అవినాష్, నిరుపమ్, మానస్ వంటి ఎందరో సినీ, టెలివిజన్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రీమియర్ చూసిన సెలబ్రిటీలంతా సిరీస్ లోని హిలేరియస్ కామెడీ టైమింగ్‌కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా లీడ్ రోల్స్ పోషించిన ప్రియదర్శి-జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య-దేవియాని శర్మ, అభినవ్ గోమటం-పావని గంగిరెడ్డిల పెర్ఫామెన్స్‌లపై ప్రశంసల వర్షం కురిసింది. ఈ మూడు జంటల మధ్య వచ్చే క్రేజీ సీన్స్‌తో పాటు, ఈ సీజన్లో సరికొత్త విలక్షణ పాత్రలో కనిపించబోతున్న వెన్నెల కిషోర్ ఎంట్రీకి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ సిరీస్, జూన్ 19 నుంచి ‘జియో హాట్‌స్టార్’ ఓటీటీ వేదికగా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కాబోతోంది.
Also Read
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!