ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్వెల్ సూపర్ హీరో మూవీ “డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్”. తాజాగా ఈ మేకర్స్ కు సౌదీలో ఎదురు దెబ్బ తగిలింది. సామ్ రైమి దర్శకత్వంలో రూపొందిన “Doctor Strange In The Multiverse Of Madness”లో బెనెడిక్ట్ కంబర్‌బాచ్, చివెటెల్ ఎజియోఫోర్, ఎలిజబెత్ ఒల్సేన్, బెనెడిక్ట్ వాంగ్, జోచిటిల్ గోమెజ్, మైఖేల్ స్టూల్‌బర్గ్, రాచెల్ మెక్‌ఆడమ్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్, డిస్నీ+ సిరీస్ వాండావిజన్ లకు కంటిన్యూగా Doctor Strange 2 రూపొందింది. ఈ మూవీలో అనేక కొత్త మార్వెల్ పాత్రలను పరిచయం చేయాలని, కొన్ని పాత పాత్రలను తిరిగి తీసుకురావాలని కూడా భావిస్తున్నారు. అయితే “Doctor Strange2” చిత్రంలో జోచిటిల్ గోమెజ్ నటించిన ‘అమెరికా ఛావెజ్’ పాత్ర ‘గే’ క్యారెక్టర్ కావడంతో సౌదీలో సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.
Read Also : Acharya Event : కాజల్ ఊసే లేదు… విలన్ని కూడా పక్కన పెట్టేశారే !?
సౌదీ అరేబియా, కువైట్, ఖతార్‌లలో సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇకపై అందుబాటులో ఉండవని సమాచారం. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రం టికెట్లు అందుబాటులో ఉండడం సూపర్ హీరో సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు సంతోషించాల్సిన విషయం. ఇంతకుముందు సౌదీ అరేబియా, యుఎఇ, ఖతార్, బహ్రెయిన్, ఒమన్, కువైట్‌లలోని థియేటర్లలో ‘వెస్ట్ సైడ్ స్టోరీ’, ‘ఎటర్నల్స్’ను కూడా బ్యాన్ చేశారు. మే 6న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.