Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Sarvam Sakthi Mayam Director Pradeep Maddali Interview

Pradeep Maddali : పూరి జగన్నాధ్ శిష్యుడు ఇలాంటి వెబ్ సిరీస్ చేశాడు అంటే ఎవరూ నమ్మరు!

Published Date :November 3, 2023 , 5:28 pm
By Bhargav Chaganti
Pradeep Maddali : పూరి జగన్నాధ్ శిష్యుడు ఇలాంటి వెబ్ సిరీస్ చేశాడు అంటే ఎవరూ నమ్మరు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sarvam Sakthi Mayam Director Pradeep Maddali Interview: సత్యదేవ్ హీరోగా ’47 డేస్’ అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ఆహాలో విడుదల అయిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ శక్తి పీఠాలు, హిందూ మతంలోని విశిష్ఠతను తెలియజేసే విధంగా ఆసక్తికరంగా తెరకెక్కించారు. కథ అందించిన బివిఎస్ రవి క్రియేటర్ గా వ్యవహరించగా ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ దసరా సందర్భంగా విడుదలై ఆహా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి మీడియాతో ముచ్చటిస్తూ పలు విషయాలను పంచుకున్నారు.

ప్రదీప్ మద్దాలి బ్యాక్ గ్రౌండ్ చెప్పండి?
మాది రాజమండ్రి, నేను ఇంజినీరింగ్ అక్కడే చేశా. ఆ తర్వాత ఐదేళ్లు ఐటీలో సిఎస్సిలో టీం లీడ్ గా పని చేశా. తర్వాత నేను రామ్ గోపాల్ వర్మతో, పూరి జగన్నాధ్ తో పరిచయం అయ్యాక నేను పూరి దగ్గర ఐదేళ్లు పనిచేశా,, తర్వాత 47 డేస్ తో దర్శకుడిగా మారాను.

Also Read

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
  • JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
  • Dhanush: రామ్ చరణ్‌ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
  • Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!

‘సర్వం శక్తి మయం’ లాంటి చాలా పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్టు ని మీ సెకండ్ ప్రాజెక్ట్ గా తీసుకున్నప్పుడు రిస్క్ అనిపించలేదా ?

– ఇలాంటి సబ్జెక్టు చేయడం చాలా పెద్ద బాధ్యత, నాకు బివిఎస్ రవి బాగా పరిచయం. అయన ఏమన్నా ప్రాజెక్ట్స్ ని డిస్కస్ చేయడానికి పిలిచేవారు, సర్వం శక్తి మయంకి బివిఎస్ రవి క్రియేటర్, రైటర్ ఆయన ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు బాగా నచ్చి చాలా మంచి అవకాశం అని వెంటనే చేస్తాను అన్నాను.

ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి రవి మిమ్మల్ని ఎంచుకున్నప్పుడు మీకేం అనిపించింది ?
– ఆయనకి నా గురించి బాగా తెలుసు, నేను పూరి గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటి నుండి ఆయన నన్ను చూస్తున్నారు. మధ్యలో చాలా ప్రాజెక్ట్స్ అనుకున్నాం, ఈ ఐడియా వచ్చిన వెంటనే దాన్ని పట్టుకుని ఆయనకు వెర్షన్స్ ఇచ్చేవాడిని, అందుకే ప్రదీప్ ఇది చేయగలడు అని నమ్మకం వచ్చుండొచ్చు.

రామ్ గోపాల్ వర్మ, పూరి, రవి వీళ్ళ ముగ్గురిలో ఒక సిమిలర్ క్వాలిటీ చెప్పండి.?

– వారు వారి దారుల్లో ఉన్నా, కామన్ పాయింట్ ఏంటి అంటే థె అర్ రెబెల్ ఇన్ థేయిర్ ఒన్ వేస్

పూరి దగ్గర నేర్చుకున్న బెస్ట్ థింగ్ ఏంటి ?

– పూరి పర్ఫెక్ట్ జెంటిల్మన్ సక్సెస్, ఫెయిల్యూర్ ని ఎలా తీసుకోవాలి, హీరో దగ్గర నుండి లైట్ బాయ్ వరకు అందరినీ ఒకేలా చూసేవారు, ఇలాంటి లైఫ్ లెసన్స్ ఎన్నో నేర్చుకోవచ్చు.

మీ ప్రాజెక్ట్ లో క్రియేటివ్ పర్సన్స్ అందరూ కలిసి చేసినట్టుంది. అందరితో ఎలా ట్రావెల్ అయ్యారు ?

– అది అలా కుదిరింది. బివిఎస్ రవి, ఈ ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్ హేమంత్ మధుకర్ చాలా రోజుల నుండీ దీని మీద వర్క్ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోయారు ఆ తర్వాత నేను ఎంటర్ అయ్యాను. ప్రాజెక్ట్ స్కేల్ చాల పెద్దది, వర్కింగ్ డేస్ తక్కువే, 58 రోజుల్లో చేసాం కానీ లొకేషన్స్ కోసం చేసిన ట్రావెల్, రెక్కీ ఇవన్నీ బాగా సమయం తీసుకున్నాయి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవన్నీ చేయగలిగా.

ఇంత స్పిరిచ్యువల్ సబ్జెక్ట్ చేయడానికి మీరు కూడా స్పిరిచ్యువల్ గా ఉండాలి, ఎంత వరకు మీరు ఆ దారిలో ఉన్నారు ?

– మాది ఆర్థడాక్స్ ఫ్యామిలీ, అమ్మ ఎప్పుడూ పూజలు చేస్తుంటారు. నేను మొదట్లో అలా ఉన్నా తర్వాత రామ్ గోపాల్ వర్మతో, పూరితో పనిచేసేటప్పుడు వాటికి దూరంగా ఆలోచించేవాడిని. నా సొంత ప్రయత్నాలు మొదలు పెట్టాక మళ్ళీ నా రూట్స్ కి వెళ్లాల్సి వచ్చింది, నేను ఒక స్పిరిచ్యువల్ పాత్ తీసుకున్నాను. ధ్యానం, క్రియ యోగ, సిద్ధ యోగ చేశా, దానిలో ఉన్న శక్తి నాకు అర్థమైంది. మనం చేస్తున్న పనికి తోడుగా ఒక శక్తి, ఎనర్జీ ఉండాలనే విషయం అర్ధం అయింది. ఈ ఆలోచనలో ఉండగానే రవి నుండి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. రవికి నేను ఈ ప్రాజెక్ట్ కి కరెక్టే అనుకోవడానికి ఇది ఒక కారణం అయ్యుండొచ్చు.

ఇలాంటి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా శ్రమ ఉంటుంది కదా ఎలా హేండిల్ చేయగలిగారు ?

– అదృష్టవశాత్తు మాకు అద్భుతమైన నటులు దొరికారు. ప్రియమణి, సంజయ్ సూరి, సమీర్ సోని, ఆశ్లేష ఠాకూర్ లాంటి మెచ్యూర్డ్ ఆక్టర్స్ ఉండడంతో నా పని చాలా సులువు అయ్యింది.

ఇలాంటి స్పిరిచ్యువల్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని మనం అనుకోకుండా జరిగిపోతుంటాయి, అలాంటి మిరకిల్స్ ఏమైనా ఉన్నాయా ?

– ఫస్ట్ షెడ్యూల్ మంచి సమ్మర్ లో స్టార్ట్ చేసాము, 18-20 రోజుల షెడ్యూల్ ఒరిస్సా నుంచి కాశ్మీర్ వరకు ప్లాన్ చేసుకున్నాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా అనుకున్న టైం లో పూర్తి చేసుకున్నాం, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అనుకున్నది అనుకున్నట్టు చేయడం పెద్ద మిరకిల్. మా నిర్మాతలు విజయ్, అంకిత్, కౌముదిని అభినందించాలి. ముందుగా ఏ ఓటిటి తో టై అప్ అవకుండా అవసరమైనంత ఖర్చు పెడుతూ ప్యాషన్ తో చేశారు. ప్రాజెక్ట్ అంతా ఎగ్జిక్యూట్ చేశాక ఓటిటికి వెళ్లాం, ఇది పెద్ద మిరకిల్ అనుకుంటాను.

చాలా వరకు హిందీ యాక్టర్స్ ఏ ఉన్నారు ? ఎందుకని?

– మేము ఈ ప్రాజెక్ట్ ఇండియా అంతా రీచ్ అవ్వాలి అని హిందీ ప్రాజెక్ట్ లా చేసాం. అందుకని అందరినీ బాలీవుడ్ కాస్టింగ్ కి వెళ్ళాం, ప్రియమణితో బ్యాలెన్స్ చేశాం. ఆవిడ కాస్టింగ్ కూడా కథకి అనుగుణంగా ఉంటుంది.

శక్తీ పీఠాల గురించి చేస్తున్నప్పుడు చిన్న మిస్ కమ్యూనికేషన్ జరిగినా ఎన్నో విమర్శలు వచ్చే అవకాశం ఉంది. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?

– రీసెర్చ్ ఏ చాలా ఇండెప్త్ గా చేశారు, రవి, సిరా శ్రీ వారితో పాటూ నేనూ డిస్కషన్ లో ఉండి స్క్రిప్ట్ రెడీ చేశాం. పేపర్ మీదనే చాలా లాజికల్ గా, రీజనింగ్ గా వచ్చింది, అలాంటి ఇబ్బంది ఎక్కడా రాలేదు.

ఈ శక్తి పీఠాలు అమ్మవారి శరీర భాగాలు పడిన స్థలాలు అని చెప్తుంటారు. వీటికి పురాణాలు, వేదాలలో ఆధారాలు ఉన్నాయా?

– అమ్మవారి శక్తి పీఠాల కథ ఇందులో చెప్పాము, దక్ష యజ్ఞం జరుగుతున్నప్పుడు సతీ దేవి తండ్రి, తన భర్త శివుడిని పిలవకుండా అవమానించినందుకు అవమాన భారంతో అదే హోమగుండంలో ఆవిడ ఆత్మాహుతి చేసుకున్నప్పుడు కోపంతో ఉన్న శివుడిని శాంతపరచడానికి శ్రీ మహావిష్ణువు ని ప్రాధేయపడితే, అమ్మవారి శరీరాన్ని ఖండించినప్పుడు ఆ శరీర భాగాలు పడ్డ ప్రాంతాలని మనం శక్తీ పీఠాలుగా కొలుస్తాం. రచయిత తోట ప్రసాద్ నాతో అష్టాదశ శక్తిపీఠాలు శక్తిమంతమైనవిగా చెప్పారు. శరీర భాగాలతో పాటు, ఆ రక్తంతో తడిచిన నేల అమ్మవారి శక్తితో నిండి ఉంది, అందుకే భారత దేశం గొప్పది అయింది, ఇది నమ్మకం మీద ఆధారపడి ఉండే అంశం.

ఆహాలో తెలుగు, తమిళ్ వెర్షన్, జీ 5లో హిందీ వెర్షన్. రెస్పాన్స్ ఎలా ఉంది ?

– జీ5లో హిందీలో జూన్ 9న రిలీజ్ అయి టెర్రిఫిక్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అహాలో తెలుగు, తమిళ్ లో అక్టోబర్ 20న విడుదల అయింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది, దేశం నలువైపుల నుండీ వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది. రెగ్యులర్ క్రైమ్, థ్రిల్లర్ జానర్ కాదు కాబట్టి పోను పోను ఎంతో మందికి రీచ్ అవుతుంది, ఇంకా ఇంకా మాట్లాడుకుంటారు.

మీ తర్వాత ప్రాజెక్ట్ ఏమిటి?

– నా నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ తాళ్లూరి ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకమైన వెబ్ సిరీస్ చేస్తున్నా, మిగతా వివరాలు త్వరలో అధికారికంగా అనౌన్స్ చేస్తాం. 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Director Pradeep Maddali
  • Director Pradeep Maddali Interview
  • Pradeep Maddali Interview

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions