Sarkaru Naukari releasing worldwide on January 1st, 2024 for New Year Eve: ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న “సర్కారు నౌకరీ” సినిమా న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో ఆకాష్ పక్కన భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి సినిమాను ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తుండగా గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. “సర్కారు నౌకరి” సినిమాను సోషల్ డ్రామా కథతో ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించామని దర్శకుడు గంగనమోని శేఖర్ వెల్లడించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆర్కే టెలీ షో బ్యానర్ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నిర్మాణం కావడం విశేషంగా మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా రాఘవేంద్ర రావు శైలికి భిన్నంగా ఉంటూనే ఇప్పటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్లు ఉంటుందని చెబుతున్నారు మేకర్స్.
RGV : దావూద్ ఇబ్రహీం ఫోన్ తో వ్యూహం సినిమాకు సెన్సార్.. వర్మ షాకింగ్ కామెంట్స్
ఇక “సర్కారు నౌకరి” సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ తో పాటు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా థియేటర్స్ లో ప్రేక్షకుల్ని ఇలాగే ఆకట్టుకుంటుందని మూవీ టీమ్ ఆశిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాష్, భావనతో పాటు తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. పరుచూరి గోపాల కృష్ణ రావు సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి శాండిల్య సంగీతం అందించగా సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం అందించారు. ఇక రాఘవేంద్ర వర్మ ఎడిటర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు రితీశా రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా రవి కుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.