RGV Comments at Vyuham Movie Pressmeet: రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీ సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న క్రమంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. వ్యూహం సినిమా డిసెంబర్ 29న రిలీజ్ అవుతున్న క్రమంలో అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని చెప్పానని, ఫైనల్ గా రిలీజ్ కు రెడీ అయ్యిందని అన్నారు. ఏం మాయ చేసి క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చారు అని అడగొద్దు, ఎందుకంటే అసలు ఏపీ సీఎంకు నాకు పరిచయం లేదని ఆయన అన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది వ్యూహం సినిమా అని ఇందులో అన్ని అంశాలను టచ్ చేసానని అన్నారు. గతంలో బయట వాళ్ళు మైక్స్ దగ్గర ఏమి చెప్పారో అదే ప్రజలకు తెలుసు కానీ వాళ్ల బెడ్ రూమ్, బాత్ రూమ్ విషయాలు ఈ సినిమాలో చూపించానని అన్నారు. అయితే అలా అని అంటూనే అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్ అని, నేను ఏమీ చూపించానో అనేది సినిమా చూస్తే తెలుస్తుందని అన్నారు.
LIC On WhatsApp : ఆ సేవలను వాట్సాప్ లోనే పొందవచ్చు.. ఎలాగంటే?
సెన్సార్ సర్టిఫికెట్ తో సినిమా పోస్టర్ డిజైన్ చేసిన చరిత్ర నాది, వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేషన్ ఎలా వచ్చిందని చెబితే మమ్మల్ని జైలుకు పంపిస్తారని అన్నారు. దావూద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించడం వల్ల వ్యూహం సినిమాకు సెన్సార్ చేశారని ఆయన అన్నారు. వ్యూహం సినిమా ఒక పొలిటికల్ డ్రామా అని వైఎస్సార్ చనిపోయిన దగ్గర నుంచి జగన్ పాదయాత్ర వరకు వ్యూహం ఉంటుందని అన్నారు. ఇక తనకు చంద్రబాబు అంటే రసగుల్లా కన్నా ఇష్టం అని పేర్కొన్న ఆయన తెలంగాణలో కేసీఆర్ ఓటమి ఓ కంట కన్నీరు, రేవంత్ రెడ్డి గెలుపు మరో కంట పన్నీరులా ఉందన్నారు. తెలంగాణలో ఉన్నంత బలమైన ప్రతిపక్షం ఏపీలో లేదని ఆయన అన్నారు. టోటల్ నా సినిమా లో కనబడేవి రియల్ క్యారెక్టర్ లు, నేను చూసినవి నేను తెలుసుకున్నవి అన్నిటినీ బేరీజు వేసుకుని నా కోణంలో తీసిన సినిమా ఇదని అన్నారు. రివైజింగ్ కమిటీ యు సర్టిఫికెట్ ఇచ్చిందని, వైఎస్ జగన్ అంటే నాకు పాజిటివ్ ఒపీనియన్ అని అన్నారు. అయితే నేను ఎవ్వరికీ ఓటు వెయ్యమని చెప్పనని అంటూ ఆయన కామెంట్ చేశారు.