నాచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు..ప్రస్తుతం నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’విడుదలకు సిద్ధం అవుతుంది. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు..ఈ మూవీ తండ్రి, కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకొని సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ కాకముందే మరో సినిమాకి కమిట్ అయ్యాడు నాని. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే సినిమాలో నాని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ టైటిల్ తో పాటు గ్లింప్స్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో నాని తన యాక్షన్ తో అదరగొట్టేసాడు. గత నెలలోనే ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మేకర్స్ ఓ అదిరిపోయే అప్డేట్ ని మేకర్స్ అందించారు. తాజాగా ‘సరిపోదా శనివారం’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టినట్లు మేకర్స్ తెలిపారు.. ఓ యాక్షన్ ఎపిసోడ్ తో షూటింగ్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. హైదరాబాదులో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.స్టంట్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ల పర్యవేక్షణలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు కొంత టాకీ పార్ట్ ని కూడా పూర్తి చేయనున్నట్లు సమాచారం.. నానితో పాటు సినిమాలోని ప్రధాన తారాగణం ఈ షూటింగ్లో పాల్గొననున్నారు.ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య మరియు కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. నాని సరసన మలయాళి బ్యూటీ ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ‘గ్యాంగ్ లీడర్’ అనే మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.ప్రేక్షకులను ఆ సినిమా ఆకట్టుకోలేదు.. కానీ సినిమాలో నాని, ప్రియాంక మోహన్ కెమిస్ట్రీ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.గ్యాంగ్ లీడర్ తర్వాత నాని, ప్రియాంక మోహన్ కలయికలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి