Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ విభిన్న కధాంశాలను ఎంచుకోని వరుస హిట్లను అందుకుంటున్నాడు. ఇటీవలే కార్తీ నటించిన సర్దార్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కార్తీ తండ్రీకొడుకులుగా కనిపించి మెప్పించారు. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ను అందించింది. ఇక ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్న నిర్మాతలు డైరెక్టర్ కు ఒక కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.
చిత్ర నిర్మాత ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్. లక్ష్మణ్ కుమార్ చిత్ర దర్శకుడు పీఎస్ మిత్రన్ కు ఓ కాస్ట్లీ కార్ ని కార్తీ చేతుల మీదుగా అందించారు. ఈ కారు విలువ దాదాపు రూ. రెండు కోట్లు వరకు ఉంటుందని అంచనా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సర్దార్ హిట్ కావడంతో మిత్రన్ సర్దార్ 2 పై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది. సీక్వెల్ లో తండ్రిలానే కొడుకు కార్తీ స్పై గా మారి దేశానికి ఎలాంటి సేవలు అందించాడు అనేది ప్రధాన అంశంగా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో కార్తీ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందో చూడాలి.