‘పంజా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సారా జెన్. ఈ సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. పంజా సినిమాతో అమ్మడి దిశ తిరుగుతుంది అనుకున్నారు కానీ ఆశించిన ఫలితం అందుకోలేక పోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు అంతంత మాత్రంగా వచ్చినా ఆ కథలు నచ్చక మళ్లీ బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఇక సినిమాలు విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం తెలుగు, హిందీ అని బేధం లేకుండా అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.
నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక తాజాగా అమ్మడు ఒక హాట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కెల్విన్ కెయిన్ వైట్ టాప్.. బ్లూ జీన్స్ లో అమ్మడు ఘాటు అందాలను ఆరబోసింది. ప్యాంట్ జిప్ తీసి మరీ పోజు ఇచ్చింది. ముఖ్యంగా సన్నజాజి నడుమును ఎరగా వేసి, మత్తెక్కించే చూపులతో మంటలు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫొటోకు నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. సూపర్.. వావ్ అంటూ కామెంట్స్ తో అదరగొడుతున్నారు.