Tollywood Box Office: పాటలతో పూనకాలు.. కథతో నీరసాలు! టాలీవుడ్లో ఇదేం వింత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Box Office: సోషల్ మీడియాలో పాట రిలీజ్ అయితే చాలు.. కుర్రకారుకు పూనకాలు వచ్చేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో ఆ బీట్లకు స్టెప్పులేస్తూ, యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ కురిపిస్తూ సినిమాపై ఆకాశమంత అంచనాలు పెంచేస్తున్నారు. పాటలే ఈ రేంజ్లో ఉంటే, ఇక థియేటర్లలో సినిమా ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. కానీ, తీరా టికెట్ కొని థియేటర్లో కూర్చున్నాక అసలు విషయం బయటపడుతోంది. పాటలు చూసి ఊహించుకున్న దానికి, తెరపై కనిపిస్తున్న కథకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో నీరసం వచ్చేస్తోందనే కామెంట్స్ ప్రేక్షకుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కొత్త సమస్య ఇదే అనే చర్చ కూడా జరుగుతోంది.
ఇటీవల రోజుల్లో సినిమా అసలు కంటెంట్ ఏంటో బయటపెట్టకుండా, కేవలం చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తోనే ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించవచ్చనే కొత్త ఫార్ములాను కొందరు దర్శకనిర్మాతలు నమ్ముకుంటున్నారు. అయితే, ఈ ట్రిక్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ వరకే పనిచేస్తోంది తప్ప, సినిమాను నిలబెట్టలేకపోతోందనే విషయాన్ని మాత్రం వారు ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ‘పెద్ది’ సినిమానే ఇందుకు పెద్ద ఉదాహరణ. అందులోని ‘రై రై రా రా’, ‘చికిరి’, ‘మస్సా మస్సా’ పాటలు గ్లోబల్ స్థాయిలో వైబ్ క్రియేట్ చేశాయి. ఆ పాటల ఊపుతో థియేటర్లకు జనం బాగానే వచ్చారు కానీ ఈ సినిమా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్‌ను మూట గట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల కట్ట’ పాటలు మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాయి. ఏ ఈవెంట్లో చూసినా అవే పాటలు మారుమోగాయి. కానీ, భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయింది.
Also Read
- Sara Arjun: సారా అర్జున్‌కు బంపర్ ఆఫర్.. మ్యూజికల్ లవ్‌స్టోరీలో ఛాన్స్.. హీరో ఎవరంటే?
- OM Box Office Collections: కలెక్షన్స్ భారీగా డ్రాప్.. 'ఓం' బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత రావాలంటే?
- Allu Arjun: అల్లు అర్జున్ ప్లాన్ అదిరింది.. మైల్ స్టోన్ మూవీకి ఎవరు?
- Amit Shah: రామాయణ టీమ్‌తో అమిత్ షా భేటీ.. రణ్‌బీర్, సాయిపల్లవికి అభినందనలు
తాజాగా రిలీజ్ అయిన ‘ఓం’ సినిమా చుట్టూ కూడా ఇదే చర్చ నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ ఈ సినిమా పాటలు దుమ్ములేపాయి. ముఖ్యంగా ‘వీరా’ పాట మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుని, సినిమాకు తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చింది. కానీ, థియేటర్లలోకి వచ్చాక సెకండాఫ్ తేలిపోయిందంటూ కొందరు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పాటలు తెచ్చిన ఆకాశమంత హైప్ అంతా ఒక్కసారిగా నీరుగారిపోవడంతో బయ్యర్లు, అభిమానులు నిట్టూరుస్తున్నారు.
ఇక్కడ అసలు లోపం ఎక్కడుందో స్పష్టంగా కనిపిస్తోంది. సంగీత దర్శకులు తమ ప్రాణం పెట్టి ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుంటే, దర్శకులు మాత్రం ఆ పాటల చాటున బలహీనమైన స్క్రిప్టులను దాచే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 30 సెకన్ల రీల్స్‌లో పాట హిట్ అయినంత మాత్రాన, రెండున్నర గంటల సినిమాను ప్రేక్షకులు భరిస్తారనుకోవడం భ్రమే అవుతోందని సినీ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ల కష్టం ఫలిస్తున్నా, కథలో బలం లేకపోవడం వల్ల ఆ కష్టమంతా వృథా అవుతోందనే అభిప్రాయాలు కామన్ ఆడియన్స్ నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మేకర్స్ కేవలం ‘ఆడియో హైప్’ మీద ఆధారపడకుండా, కథను నమ్ముకుంటేనే బాక్సాఫీస్ వద్ద అసలైన విజయాలు దక్కుతాయని అంటున్నారు.
తాజావార్తలు
-
Tollywood Box Office: పాటలతో పూనకాలు.. కథతో నీరసాలు! టాలీవుడ్లో ఇదేం వింత?
-
Nvidia: ఎన్విడియాలో మరో సంచలన ప్రేమకథ.. చైనా లింక్ ఉన్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌తో సీఈఓ సన్నిహితుడి రహస్య వివాహం..?
-
National Stock Exchange: భారత్‌కు మరో ఘనత.. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్గా రికార్డు..
-
Astrology Predicts: 2027లో ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాల యోగం!
-
Nvidia: చైనాకు AI చిప్‌లు చేరకుండా అమెరికా వ్యూహం.. నాలుగు దేశాలకు ఎన్విడియా షాక్!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!