Nvidia: ఎన్విడియాలో మరో సంచలన ప్రేమకథ.. చైనా లింక్ ఉన్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌తో సీఈఓ సన్నిహితుడి రహస్య వివాహం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. సంస్థ సీఈఓ జెన్సెన్ హువాంగ్‌కు అత్యంత సన్నిహితుడు, ఎన్విడియా మాజీ సేల్స్ చీఫ్ అయిన భారత సంతతి ఎగ్జిక్యూటివ్ జే పూరి, సర్వర్ తయారీ సంస్థ ‘సూపర్ మైక్రో కంప్యూటర్’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సెన్లీ చెన్ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఎన్విడియా కృత్రిమ మేధస్సు చిప్‌ల కోసం సూపర్ మైక్రో తీవ్రంగా పోటీపడుతున్న సమయంలోనే వీరిద్దరూ చాలా ఏళ్లపాటు డేటింగ్ చేశారని, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో వివాహం కూడా చేసుకున్నారని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’, ఇతర అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఎన్విడియాలో ప్రపంచవ్యాప్త విక్రయ విభాగానికి నాయకత్వం వహించిన జే పూరి, సూపర్ మైక్రో వంటి ప్రధాన కస్టమర్లకు చిప్‌ల సరఫరా, వాణిజ్య ఒప్పందాలను పర్యవేక్షించేవారు. అయితే.. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించి చైనాకు అక్రమంగా ఎన్విడియా చిప్‌లను తరలించారన్న ఆరోపణలపై సూపర్ మైక్రో సిబ్బందిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెన్లీ చెన్, ఇతర ఉన్నతాధికారుల వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం.
Also Read
- Netflix Pakistani content India: పాకిస్థానీ వెబ్ సిరీస్ వివాదం.. Netflixకు కేంద్రం కీలక సూచన!
- Saurav Das LOC Case: లుకౌట్ సర్క్యులర్‌తో సౌరవ్ దాస్‌కు అడ్డంకి.. ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం కీలక సమాచారం
- Amit Shah: రామాయణ టీమ్‌తో అమిత్ షా భేటీ.. రణ్‌బీర్, సాయిపల్లవికి అభినందనలు
- Indian Constitution Day 2026: భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమూల్యమైన సంపద.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ఇప్పటివరకు జే పూరిపై గానీ, సెన్లీ చెన్పై గానీ ఎటువంటి నేరారోపణలు నమోదు కాలేదు. ఎన్విడియాతో తమ సంస్థ సంబంధాలను గానీ, జీపీయూ కొనుగోళ్లను గానీ సెన్లీ చెన్ పర్యవేక్షించలేదని సూపర్ మైక్రో స్పష్టం చేసింది. ఈ ఏడాది మధ్యలో వీరిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకున్నారు; ప్రస్తుతం జే పూరి ఎన్విడియాకు సీనియర్ సలహాదారుగా కొనసాగుతున్నారు. ఇటీవలే సీఈఓ జెన్సెన్ హువాంగ్ వ్యక్తిగత వ్యవహారాలపై బోర్డు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో, ఎన్విడియా ఉన్నత స్థాయి అధికారుల ప్రవర్తన, వ్యాపార పారదర్శకతపై పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Nvidia: ఎన్విడియాలో మరో సంచలన ప్రేమకథ.. చైనా లింక్ ఉన్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌తో సీఈఓ సన్నిహితుడి రహస్య వివాహం..?
-
National Stock Exchange: భారత్‌కు మరో ఘనత.. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్గా రికార్డు..
-
Astrology Predicts: 2027లో ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాల యోగం!
-
Nvidia: చైనాకు AI చిప్‌లు చేరకుండా అమెరికా వ్యూహం.. నాలుగు దేశాలకు ఎన్విడియా షాక్!
-
Sara Arjun: సారా అర్జున్‌కు బంపర్ ఆఫర్.. మ్యూజికల్ లవ్‌స్టోరీలో ఛాన్స్.. హీరో ఎవరంటే?
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!