Sapta Sagaralu Dhaati: ఒక హిట్ సినిమా.. ఓటిటీకి రావాలంటే మినిమమ్ లో మినిమమ్ మూడు వారాలు పడుతోంది. ఇంకా ఆ సినిమా థియేటర్ లో ఆడుతుంది అంటే ఇంకొన్ని రోజులు ఆలస్యం అవుతుంది.. ఇది అందరికి తెల్సిందే. అయితే ఓటిటీ వచ్చాకా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా కూడా ఓటిటీలోకి వచ్చాకా చూడొచ్చులే అనే ధీమా పెరిగిపోయింది. కేవలం థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు థియేటర్ వరకు వెళ్లి చూస్తున్నారు. ఇక ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకున్న ఓటిటీ మేకర్స్ సైతం వారి అభిరుచికి తగ్గట్టే సినిమాలను ఓటిటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యనే ఓటిటీ ఒక కొత్త రూల్ పెట్టింది. ఓటిటీలో సినిమా రిలీజ్ చేయాలంటే ముందు థియేటర్ రిలీజ్ చేయడం కంపల్సరీ. దీంతో మేకర్స్ .. ముందు థియేటర్ లో రిలీజ్ చేసి.. వారం రోజుల తరువాత ఓటిటీలోకి వదిలేస్తున్నారు. దీనివలన థియేటర్ లో సినిమా చూడడం కోసం టికెట్ కొనుక్కొని వెళ్లిన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Ritika Singh: రక్తం మరుగుతోంది.. గుండె మండుతోంది.. రితికా సింగ్ పోస్టు వైరల్
ఇక తాజాగా ఎంతో ఆశతో వారం రోజుల క్రితం థియేటర్ లో చూసిన సినిమా ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతుందని తెలిసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా ఏదో కాదు సప్తసాగరాలు దాటి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అద్భుతమైన ప్రేమకథగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా గతవారం రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. వారం రోజులు కూడా అవ్వకముందే ఈ సినిమా ఓటిటీలో స్ట్రీమింగ్ ఆ కావడం ఏంటి అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.