కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరదాచె ఎల్లో సైడ్ ఏ మరియు సైడ్ బీ.. ఈ రెండు చిత్రాలు కన్నడలో మంచి విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు తెలుగులో సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, మరియు సైడ్-బీ గా విడుదల అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో మంచి కలెక్షన్లను దక్కించుకున్నాయి. గతేడాది నెలల వ్యవధిలో థియేటర్లలో రిలీజైన ఈ లవ్ ఎమోషనల్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఈ రెండు చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చాయి. అయితే, సప్త సాగరదాచె ఎల్లో సైడ్-బీ సినిమా సడెన్‍గా ఓటీటీలో మాయమైంది.సప్త సాగరదాచె ఎల్లో సైడ్-బీ సినిమా జనవరి 25వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలలకు ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. చాలా ఆలస్యంగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఇప్పుడు తాజాగా ఈ సైడ్-బీ సినిమా ఆ ఓటీటీలో మాయమైంది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రస్తుతం సప్త సాగరదాచె సైడ్-ఏ సినిమా అందుబాటులో ఉన్నా.. సడెన్‍గా సైడ్-బీ మూవీ మిస్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో కొందరు యూజర్లు పోస్టులు చేస్తున్నారు. సైడ్-బీ సినిమా ఎందుకు మిస్ అయిందని ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రైమ్ వీడియో నుంచి ఈ విషయంపై ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.సప్త సాగరదాచె ఎల్లో చిత్రాలకు హీరో రక్షిత్ శెట్టి నిర్మాతగానూ ఉన్నారు. సైడ్-ఏ, సైడ్-బీ చిత్రాల శాటిలైట్ హక్కులను జీ నెట్‍వర్క్ సొంతం చేసుకుంది. అయితే, సైడ్-బీ చిత్రాన్ని ‘జీ5’ ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. అందుకే.. సైడ్-బీ మూవీ ప్రైమ్ వీడియోలో మిస్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం వుంది.