సంక్రాంతి.. తెలుగువారి అతిపెద్ద పండగ.. ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ళు, ఆడపడుచులు.. పిండి వంటలు.. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టుతో కనిపించే అమ్మాయిలు. ఇక ఈరోజు అమ్మాయిలందరూ ఎంతో పద్దతిగా చీరకట్టు.. బొట్టు పెట్టుకొని ముగ్గులు వేస్తూ దర్శనమిస్తారు. అయితే హీరోయిన్లు కూడా మేము మాత్రం తక్కువా అంటూ చీరకట్టులో దర్శనమిచ్చి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తారల చీరకట్టు తళుకులు ట్రెండింగ్ గా మారిపోయాయి. మరింకెందుకు ఆలస్యం ఈ సంక్రాతి ముద్దుగుమ్మలు.. తెలుగింటి ఆడపడుచుల ఎలా రెడీ అయ్యారో మీరు కూడా ఓ లుక్కెయ్యండీ..






