Sangeetha: శివ పుత్రుడు, ఖడ్గం వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సంగీత. టాలీవుడ్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సంగీత పెళ్లి తరువాత టాలీవుడ్ కు దూరమైంది. ఇక ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక తల్లిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఆశ్చర్యంలో చిరు సరసన ఆడిపాడి మెప్పించింది. తాజాగా మసూద అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఒక టాక్ షో కు వచ్చిన సంగీత పలు ఆసక్తికర విషయాలను పంచుకోంది.
సరిలేరు నీకెవ్వరు హీరోయిన్ మదర్ గా నటించారు.. అది మీకు ప్లస్ అయ్యిందా..? మైనస్ అయ్యిందా..? అన్న ప్రశ్నకు సంగీత సమాధానం చెప్తూ “రెండు అయ్యాయి. మొదట ఈ కథను అనిల్ రావిపూడి వచ్చి చెప్పినప్పుడు రేయ్ ఇలా చేశావురా నన్ను అని తిట్టుకున్నాను. ఇప్పటికి అనిల్ రావిపూడిని తలచుకొంటే తిట్టుకుంటూనే ఉంటాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఒకానొక సమయంలో తనతో సినిమా చేస్తామని రెండు రోజులు షూటింగ్ చేసి తరువాత తీసేశారని చెప్పి ఎమోషనల్ అయ్యింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ముగ్గురు పిల్లల తల్లిగా సంగీత నటించింది. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే డైలాగ్ తో సంగీత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం సంగీత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.