Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన చిత్రం అనిమల్. రణ్‍బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, శక్తికపూర్, చారు శంకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా డిసెంబర్ 1న భారీగా విడుదలై భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక మొదటి నుంచి సందీప్ మనస్తత్వం గురించి అందరికి తెల్సిందే. ఫేక్ ఎమోషన్స్ ను చూపించడం అతనికి రాదు. అతని దర్శకత్వంలో ఏ సినిమా వచ్చినా కూడా ఎంతో కొంత ట్రోలింగ్ ఉంటూనే ఉంటుంది. ఇక అనిమల్ సినిమాలో హింస ఎక్కువ ఉందని, అసలు హీరో చేసిన మారణకాండ చూసి ముక్కున వేలేసుకున్నారు ప్రేక్షకులు. ఇక ఈ హింస గురించి, మూవీ క్రిటిక్స్ గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.
” వీళ్లంతా వచ్చేది సినిమా హిట్ అయ్యింది కాబట్టి. ఇప్పుడు మంచి సినిమాలు ఉన్నాయి. మంగళవారం.. నాకు చాలా బాగా నచ్చింది. మంత్ ఆఫ్ మధు, అంటే సుందరానికి.. పర్సనల్ గా అంటే సుందరానికి నాకు చాలా బాగా నచ్చింది. ఆ సినిమా హిట్ కాలేదు కాబట్టి మాట్లాడలేదు.. ఒకవేళ హిట్ అయితే అందులో కూడా తప్పులు వెతికేవారు. ఒకవేళ అనిమల్ కనుక పోయి ఉంటే.. నన్ను కూడా అలానే అనేవారు. ఒక సినిమాను సినిమాలా చూడాలి.. మొరాలిటీస్ అన్ని పక్కన పెట్టి చూడాలి. అవన్నీ చూడడానికి సెన్సార్ ఉంది. వాళ్ళు చూసుకుంటారు. వాళ్లు సర్టిఫికెట్ ఇచ్చాక వీళ్లంతా ఎందుకు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఉహించుకొని ఒకవేళ అనిమల్ పోతే.. ఈ వ్యక్తి అద్భుతమైన ఒక్క సినిమాకే పరిమితం.. వీడి యారోగెన్స్ కు తగిన శాస్తి జరిగింది అనిరాసేవారు. హిట్ అయ్యింది కాబట్టి నేను ఇప్పుడు జీనియస్ లా కనిపిస్తున్నాను. కానీ, నేను ఎప్పుడు ఒకే పర్సన్ ను.. అలాంటి ఎనాలసిస్ ఎవరు చేయరు. హిట్ అయితేనే అందరూ మాట్లాడతారు.. అది నిజం.. సినిమా రన్ అవుతుంది డబ్బు వలనే.. అలాంటి ప్రశ్నలు అడగకుండా ఏవేవో అడుగుతారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి/