Sandeep Madhav New movie: సందీప్ మాధవ్ హీరోగా కేథరిన్ త్రెసా హీరోయిన్‌గా ‘ఓదెల రైల్వేస్టేషన్’ దర్శకుడు భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేశారు. అశోక్ తేజ దర్శకుడుగా మారి తెరకెక్కించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఎంతటి ఘన విజయం సాధించిందితో తెలిసిందే! ఆహా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించిన ఈ దర్శకుడు అశోక్ తేజ ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. కేథరిన్ త్రెసా హీరోయిన్‌గా, ‘జార్జిరెడ్డి’, ‘వంగవీటి’ చిత్రాలతో గుర్తింపు పొందిన సందీప్ మాధవ్ హీరోగా ఒక యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కించనున్నారు.
Ustaad Bhagat Singh: ఈ కాంబో పై అంచనాలు కూడా మారవు.. వెయిటింగ్
కేసీఆర్ ఫిల్మ్స్, శ్రీ మహావిష్ణు మూవీస్ బ్యానర్లపై ప్రొడక్షన్ నంబర్‌వన్‌గా ఈ సినిమా రూపొందనుంది, దావులూరి జగదీష్, పల్లి కేశవరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై చివరి వారంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇక‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రాన్ని చివరి వరకూ సస్పెన్స్ రివీల్ చేయకుండా ఎంతో గ్రిప్పింగ్‌గా రూపొందించిన అశోక్ తేజ యాక్షన్ థ్రిల్లర్‌ను అంతకుమించి అద్భుతంగా రూపొందిస్తారని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేథరిన్ అనేక మంది స్టార్ హీరోలతో నటించినా ఆమె కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంటారు. కొత్త దర్శకుడితో కథ ఓకే చేసింది అంటే సినిమా పాయింట్ ఆసక్తికరమైనదే అని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.