యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా కలిసి నటిస్తున్న రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ “సమ్మతమే”. ఈ ప్రత్యేకమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరో హీరోయిన్లను, వారి క్యారెక్టర్లను పరిచయం చేశారు మేకర్స్.
Read Also : విజయ్ దేవరకొండ, దిల్ రాజు మైండ్ బ్లోయింగ్ ప్లాన్
హీరోయిన్ తన సహోద్యోగి చాందిని చౌదరిని ప్రేమిస్తాడు. కిరణ్ చాలా నెమ్మదస్తుడిగా కన్పిస్తుంటే, చాందిని మాత్రం మందు, సిగరెట్ తాగుతూ ఆధునిక యువతిగా కన్పించింది. పాటలను పాటలుగా కాకుండా మాటలుగా చెప్పాలంటూ హీరోయిన్ పెట్టిన కండిషన్ కొత్తగా ఉంది. మరి వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో సినిమాలో చూడాలి. గ్లింప్స్ వీడియోలో అద్భుతమైన విజువల్స్, ఆహ్లాదకరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది.