Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ కు పాపం నిరాశనే ఎదురయ్యింది. ఎన్నో ఆశలు పెట్టుకొని రిలీజైన పాన్ ఇండియా మూవీ .. అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం సామ్ ఆశలన్నీ ఖుషీ మీదనే పెట్టుకుంది. మజిలీ లాంటి హిట్ సినిమాను ఇచ్చిన శివ నిర్వాణతో సామ్ రెండో సారి వర్క్ చేస్తుంది. విజయ్ దేవరకొండ సరసన కూడా అమ్మడు రెండోసారి నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక గత కొన్నిరోజుల ఖుషీ టీమ్ టర్కీలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఎప్పటికప్పుడు విజయ్ కానీ, సామ్ కానీ.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
Amruta Fadnavis: ఈ డిప్యూటీ సీఎం భార్య యమా హాట్ గురూ..
ఇక తాజాగా సామ్.. మరోసారి టర్కీ డైరీస్ ను షేర్ చేసింది. టర్కీలో ఉన్న బెస్ట్ డేస్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇక టర్కీలో తాను వేసిన వేషాలన్నింటిని ఫోటోల ద్వారా చెప్పుకొచ్చింది. అద్దం ముందు నిలబడి సెల్ఫీలు దిగడం.. కారులో పడుకొని బుక్స్ చదవడం.. బాత్ చేసి .. బాత్ టవల్ తో ఉన్నప్పుడు ఉన్న ఫోటోలను కూడా సామ్ షేర్ చేసింది. అన్ని ఫోటోలను సామ్ చాలా క్యూట్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఖుషీ కాకుండా సామ్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. మరి ఈ సినిమాలతో సామ్ ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.