Director Sukumar Next Movie with Chiranjeevi: సుకుమార్ పుష్పతో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న ఫిల్మ్ మేకర్. సుకుమార్ ఇంతకు ముందు చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఆడియన్స్ ని థ్రిల్ చేసి, భారీ కలెక్షన్స్ రాబట్టాయి. అయితే పుష్ప 1 తో నేషనల్ లెవెల్ లో అదరగొట్టిన సుక్కు ఇప్పుడు పుష్ప2తో మరో వండర్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అయితే పుష్ప 2 తర్వాత సుకుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న చర్చ ఇప్పుడు గట్టిగా జరుగుతోంది. పుష్ప 2 తర్వాత సుకుమార్ కొత్త ప్రాజెక్ట్ కచ్చితంగా మెగా కాంపౌండ్ లోనే ఉంటుందని హింట్స్ వచ్చాయి. అయితే మెగా కాంపౌండ్ డజన్ మంది హీరోలు ఉన్నారు. వాళ్లలో సుకుమార్ సినిమా చేసేది ఎవరన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.
Karthika Deepam Season 2: ఇదెక్కడి క్రేజ్ మావా.. సీరియల్ కి ప్రీ రిలీజ్ ఈవెంటా?
పుష్ప 2 పూర్తి కాగానే కాస్త రెస్ట్ తీసుకుని తన నెక్ట్స్ సినిమా చేసేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా మరొకరు రామ్ చరణ్. ఈ ఇద్దరితోనే సుకుమార్ సినిమా ఉంటుందని చెబుతున్నారు. గతంలోనే రామ్ చరణ్ తో రంగస్థలం సినిమా చేశాడు సుకుమార్. చరణ్ లోని నటుడిని వెలికితీసి వారెవా అనిపించాడు. ఇప్పుడు మరోసారి ఆ కాంబో రిపీట్ అవుతుందని అంటున్నారు. చరణ్ కూడా సుకుమార్ తో సినిమా అంటే రెడీ గానే ఉంటాడు. అయితే శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న చరణ్ ఆ తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో ఓ మూవీ ఫిక్స్ తాజాగా ఓపెనింగ్ కూడా చేసుకున్నాడు.ఈ రెండు కంప్లీట్ అవ్వడానికి రెండేళ్లు పడుతుంది. అంత వరకు సుకుమార్ వెయిట్ చేయడం కష్టం. అందుకే చిరంజీవితోనే తన నెక్స్ట్ సినిమా చేసే ప్లాన్ లో సుకుమార్ ఉన్నాడని టాక్. చిరు ప్రజెంట్ విశ్వంభర చేస్తున్నారు. తర్వాత హరీష్ శంకర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ లోగా పుష్ప2 కంప్లీట్ చేసి మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేసి రెడీగా ఉంటాడట సుకుమార్. చూడాలి ఇందులో ఎంతవరకు నిజం అవుతుంది అనేది.