చిత్ర పరిశ్రమ అన్నాకా అవమానాలు తప్పవు. మరి ముఖ్యంగా హీరోయిన్లకు ట్రోలింగ్ తప్పదు.. హీరోయిన్ ఎలా ఉన్నా ట్రోల్ చేస్తూనే ఉంటారు ట్రోలర్స్.. ఇక కొంతమంది హీరోయిన్లు ట్రోల్స్ ని పట్టించుకోరు.. మరికొంతమంది ఆ ట్రోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చి బుద్ధి చెప్తారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల సామ్ డ్రెస్సింగ్ పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. బోల్డ్ అవతారంలో కనిపిస్తున్న సామ్ పై ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. విడాకుల తరువాత బోల్డ్ గా మారిందని, ఇలా ఉండబట్టే అక్కినేని ఫ్యామిలీ వదిలిసిందని విమర్శిస్తూ వచ్చారు. ఇక నిన్నటికి నిన్న ఒక అవార్డు ఫంక్షన్ లో సామ్ వేసుకున్న డ్రెస్ పై ట్రోల్స్ గట్టిగా వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఈ ట్రోల్స్ కి స్పందించింది సామ్.. ” ఒక స్త్రీగా నా నిర్ణయాన్ని చెప్పడం అంటే ఏంటో నాకు తెలుసు. మహిళ ధరించే దుస్తులు, రంగును బట్టి ఆమె గురించి జడ్జ్ చేసేస్తున్నారు. ఆడవారి దుస్తులను చూసి జడ్జ్ చేసే జనాలు సమాజంలో మంచి జరిగే వాటిపై ఆలోచిస్తే బావుంటుంది. మహిళల దుస్తులు, చదువు, సామాజిక స్థితి, వారి రూపురేఖలు, కలర్.. ఇలా ఎన్నోరకాలుగా వారిపై కామెంట్లు చేయడం సులభమే.. కానీ అది ఎంతవరకు కరెక్ట్.. మనం 2022 లో ఉన్నాం.. మహిళలు ధరించే దుస్తుల్లో హెమ్‌లైన్, నెక్‌లైన్ చూసి జడ్జ్ చేయడం మానేసి .. మీ దృష్టిని మెరుగుపరచడానికి దృష్టి సారించగలమా? మీ అభిప్రాయాలను రుద్దడం వల్ల ఎవరికీ మేలు జరగదు.. ఒక వ్యక్తిని అర్ధం చేసుకోవడంలో కొత్తగా ప్రయత్నించండి. దయచేసి జడ్జ్ చేయడం మానండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
