ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత- నాగ చైతన్య పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. నాలుగేళ్ళ క్రితం ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకోంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు కొన్ని విబేధాల కారణంగా గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఎప్పుడైతే సామ్, చైతో సపరేట్ అయ్యిందో అప్పటినుంచి అక్కినేని అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఏ పని చేసినా నెగెటివ్ గా చిత్రించి కామెంట్స్ లో నెగెటివ్ గా మాట్లాడుతునే ఉంటారు. ఇక కొన్ని కామెంట్స్ కు సమంత తనదైన రీతిలో కౌంటర్లు వేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఒక నెటిజన్ మాట్లాడిన వల్గర్ వర్డ్స్ కు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. సమంత మాజీ భర్త నాగ చైతన్య, హీరోయిన్ శోభితా దూళిపాళ్ల తో డేటింగ్ చేస్తున్నట్లు పలు ఇంగ్లీష్ వెబ్ సైట్స్ ప్రచురించాయి. అందులో ఏమున్నది అంటే.. ‘మేజర్’ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ చేసున్నాడని, ఒకటి రెండు సార్లు ఆమె ఉన్న హోటల్ కు చై వెళ్లడం.. చై ఇంటికి శోభితా వెళ్లడం కెమెరాల కంట పడినట్లు రాసుకొచ్చారు. అంతేకాకుండా త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా అభిప్రాయపడ్డారు. ఇక వార్తపై అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది సామ్ ను ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అందులో ఒక నెటిజన్ సామ్ పై దారుణమైన కామెంట్స్ చేశాడు. ” సమంత ఒక వేశ్య.. బట్టలు విప్పి బజారులో తిరగమని చెప్పు.. ఈ ఐటెం దాని కోసం మా వాడు దేవదాసులా ఉండాలా..?” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ పై సమంత స్పందిస్తూ.. “నిజంగా భయపడాలి” అని అంటూ రెండు స్మైల్ ఎమోజీలను జోడించింది. అంటే కొంచెం వెటకారంగా భయపడేది ఏమి లేదు అన్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే సదురు నెటిజన్ ట్వీట్ ను డిలీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ గా మారింది.
😂😂must be really scared… https://t.co/xESf3CmlEE
— Samantha (@Samanthaprabhu2) June 20, 2022