Samantha Speech at KUSHI Musical Concert Event LIVE: ఖుషీ లైవ్ కన్సర్ట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ఈ ఖుషీ లైవ్ కన్సర్ట్ లో సమంత మాట్లాడుతూ ఖుషీ ఎలా అనిపించింది, గ్రేట్ గా ఉంది కదా అని అన్నారు. షూటింగ్ లో ఈ సాంగ్స్ విన్నప్పటి నుంచి ఈ ఆల్బమ్ తో లవ్ లో పడిపోయాను. ఇక ఇవాళ లైవ్ లో మీ అందరూ మ్యూజిక్ ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఈ రోజును ఇంత స్పెషల్ గా మార్చినందుకు థాంక్యూ సో మచ్. మీ ఎనర్జీ చూసి నేను సెప్టెంబర్ 1st కు టైమును ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీతోనే సినిమా చూడాలి అనిపిస్తోంది. ఎప్పుడూ మీకు నచ్చిన ఒక మంచి సినిమా తీయాలనేదే మా ప్రయత్నం. ఈసారి అలాంటి సినిమానే చేశామని నమ్ముతున్నాను. మీరు సెప్టెంబర్ 1st ఖుషీ సినిమాను ప్రేమిస్తారని నమ్ముతున్నా, మీరు ప్రేమించాలని ప్రార్థిస్తున్నా. నేను ఈరోజు కొంత మందికి థాంక్స్ చెప్పాలి. ముందుగా మా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి గారికి థాంక్స్.
స్టేజ్ పై రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ-సమంతలు
ఒకరకంగా థాంక్స్ చెప్పడానికి మాటలు చాలడం లేదు, గత ఏడాది కాలంలో మీరు నా పట్ల చూపించిన సహనం, కేరింగ్ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మీరు నాకు ఎప్పటికీ ఫెవరేట్ ప్రొడ్యూసర్స్ . అలాగే నాకు ఇష్టమైన మనుషులు కూడా. ఇక డైరెక్టర్ శివ, హీరో విజయ్ గారికి ఎన్ని థాంక్స్ చెప్పాలి. థాంక్ గాడ్ విజయవాడలో సమంత ఇడ్లీ స్టాల్ పెట్టే అవసరం రాలేదు. టైంకు వచ్చి నేను సినిమా ఫినిష్ చేసేశాను, ఎందుకంటే ఈ ఇడ్లీ బిజినెస్ మీరు చేయగలరా లేదా అని డౌట్స్ ఉన్నాయి అని అన్నారు. అయితే మీరు ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీస్తారని మాత్రం నమ్మకం ఉంది. మీరు నన్ను భరించినందుకు, అర్థం చేసుకున్నందుకు థాంక్స్. ఇలాంటి ఒక మంచి జర్నీలో నన్ను భాగం చేసినందుకు థాంక్స్. హేషం మా తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకుని ప్రేమిస్తే ఎలా ఉంటుందో మీరు చూస్తారు కంగ్రాట్యులేషన్స్ అని ఆమె అన్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చినందుకు, ఒక అద్భుతమైన నైట్ లైవ్ పెర్ఫార్మెన్స్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ అని సమంత అన్నారు. ఇక తరువాత ఆమె పేరుపేరునా థాంక్స్ చెప్పారు. మీకోసమే హార్డ్ వర్క్ చేస్తున్నా, హెల్తీగా తిరిగివస్తా బ్లాక్ బస్టర్ ఇస్తాను అని పేర్కొన్న ఆమె మీ ప్రేమ వల్ల తాను బౌన్స్ బ్యాక్ అవుతానని ఆమె అన్నారు.