టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ, కొత్త విషయాలను పంచుకుంటుంది. ఫ్యాన్స్‌కి ఎప్పుడూ ప్రేరణాత్మకంగా, పాజిటివ్ మెసేజ్‌లు ఇస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌తో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ . ఈ క్రమంలో ఒక ఫ్యాన్ “మీ జీవితాన్ని మార్చిన కొటేషన్ ఏది?” అని అడిగినప్పుడు, సమంత “మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి విషయం మనకు పాఠాలు నేర్పిస్తుంది. అలాంటి వాటి నుండి ఏదో ఒకటి నేర్చుకోవడం చాలా ముఖ్యం” అని తెలిపింది.
Also Read : SSMB29 : జక్కన్న స్పెషల్ ప్లాన్.. మహేష్-ప్రియాంక చోప్రా ఫోక్ సాంగ్ రెడీ!
ఇంకా ఫ్యాన్స్ ఆమె తదుపరి తెలుగు ప్రాజెక్ట్ గురించి అడిగారు. సమంత “మా ఇంటి బంగారం” చిత్రం షూటింగ్ ఈ నెలలో ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. గతంలో ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం సినిమాల నుంచి విరామం తీసుకున్న సమంత, ఇప్పుడు మళ్లీ యాక్టివ్‌గా ఉందని చెప్పడం, ఆమె అభిమానులను ఆనందపరిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా సమంత ప్రొడక్షన్ హౌస్ పేరుతో నూతన కథానాయికలను పరిచయం చేస్తూ, మరిన్ని అనుభూతులు పంచనుంది. అదేవిధంగా, “ఈశా ఫౌండేషన్ అంటే ఎందుకు ఇష్టం?” అనే ప్రశ్నకు సమంత జవాబు ఇస్తూ, “అది నా రెండో ఇంటి లాగే ఉంది. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది” అని తెలిపింది. ఫ్యాన్స్ కోసం తన నిజమైన భావాలను పంచుకుంటూ, సమంత మళ్లీ తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నది. ఆరోగ్య సమస్యల తరువాత మళ్లీ చురుకైన, పాజిటివ్ సమంతను చూసి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు.