మూవీస్ విషయం పక్కన పెడితే .. పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది సమంత. స్టార్ హీరోయిన్ అయినప్పటికి అవమానాలు, మాటలు మాత్రం తప్పడం లేదు. రీసెంట్ గా చై.. రెండో పెళ్లి చేసుకున్నటి నుంచి సమంత గురించి మరి దారుణంగా వార్తలు వినపడుతున్నాయి. కానీ అవేమి పటించుకొని సామ్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. సోషల్ మీడియాలో కూడా మునుపటి కంటే చాలా యాక్టివ్ గా ఉంటుంది. పలు షో లలో కూడా పాల్గోంటూ తనకు తోచిన మంచి మాటలు పంచుకుంటు ఉంది సామ్. ఇందులో భాగంగా తాజాగా విడాకులు తీసుకున్న ఒక స్త్రీ.. సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదురుకుంటుంది తెలుసా అంటూ.. ఇంట్రస్టింగ్ కామోంట్‌లు చేసింది.
Also Read:Priyanka Chopra: SSMB29 మూవీ కోసం ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సమంత మాట్లాడుతూ.. ‘ విడాకులు తీసుకున్న స్త్రీ ని ఈ సమాజం ఎలా చూస్తుందో నాకు బాగా తెలుసు. చాలా ఏళ్ళు నేను దీంతో జీవించాను. నా గురించి ఎన్నో అబద్ధాలు పుట్టించారు. చాలా సార్లు అందులో నిజం లేదు అని చెప్పాలనిపించింది, కానీ నన్ను ఆపింది ఏమిటంటే.. నేనే. అవును నాతో నేనే సంభాషణ చేసుకునేది. ఒకరి గురించి జీవితం గురించి కథలుగా చెప్పాలని మీరు ఉత్సాహంగా ఉండొచ్చు. కానీ దాని నుండి ఏమి పొందుతారు? అప్పటి వరకు మీకది ఆనందం ఇస్తుండోచ్చేమె ఆ తర్వాత, మీరు ఎంత తెలివి తక్కువ పని చేశారో మీకే అర్థం అవుతుంది. అప్పుడు మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటారు. ఇకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను విడాకులు తీసుకోవడం మొదట బాధగా అనిపించింది. నా చుట్టూ ఉన్నది ముందులా లేదు. అంతా మారిపోయింది.అలా అని నేను మూలన కూర్చుని ఏడుస్తూ,ధైర్యం కోల్పోలేదు. ఇంతటితో నా జీవితం ముగియలేదు.. అది ముగిసిన చోటే మొదలవుతుంది. ప్రజంట్ నేను సంతోషంగా ఉన్నాను, మంచి వ్యక్తులతో పని చేస్తున్నాను, నా జీవితంలో తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను’ అని తెలిపింది సమంత. ప్రజంట్ సామ్ మాటలు వైరల్ అవుతున్నాయి. కానీ తనలో ఎంత బాధ దాగి ఉందో తన మాటలో అర్థం అవుతుంది.