Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సామ్.. గతేడాది నుంచి సినిమాలకు బ్రేక్ చెప్పి.. రెస్ట్ తీసుకొంటుంది. ప్రకృతిలో మమేకం అయ్యి.. తన వ్యాధితో పోరాడుతుంది. ఇక అంతకుముందు కన్నా.. సామ్ పరిస్థితి మెరుగుపడిందని చెప్పాలి. ఇంకా ఆమె కఠోరమైన చికిత్స తీసుకుంటూనే ఉంది. ముఖ్యంగా ఫుడ్ విషయంలో.. తనకు పడని వస్తువుల దగ్గరకు వెళ్ళను కూడా వెళ్లడం లేదు. ఇక అభిమానులకు దూరం కాకుండా నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. అలరిస్తూ ఉంది.
ఇకపోతే తాజాగా సమంత.. తాను ఎమర్జెన్సీ రూమ్ కు వెళ్ళడానికి కారణమైనది ఏంటో చెప్పుకొచ్చింది. అవే పూలు. అవును మీరు విన్నది కరక్టే. ఎవరికైన పూలు అంటే ఇష్టం ఉంటుంది. కానీ, సామ్ కు పూలు అలర్జీ అని చెప్పుకొచ్చింది. వాటివలనే తాను ఎమర్జెన్సీ రూమ్ కు వెళ్లినట్లు తెలిపింది. చాలా గ్యాప్ తరువాత పూలు పట్టుకొని కనిపించింది. ఈ పూలు తనను భయపెడుతున్నాయని సామ్ చెప్పుకొచ్చింది. ” మీరు ఈ అందమైన వస్తువులను ఇష్టపడినప్పుడు ఎన్నో భావాలను పంచుకుంటారు. కానీ, నేను వీటిని చూసి చాలా భయపడుతున్నాను, ఎందుకంటే.. వీటివలనే నేను గతంలో ఎమర్జెన్సీ రూమ్ కు వెళ్లాల్సివచ్చింది. పువ్వులతో నరకం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.