సమంత తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. పెళ్ళైనప్పటికీ ఆమె సినిమాల్లో నటించడం మానలేదు. నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రల్లో నటిస్తూ అటు అక్కినేని అభిమానులను, ఇటు తన ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి జంటగా నటించిన “ఫ్యామిలీ మ్యాన్ 2” అనే వెబ్ సిరీస్ లో చివరిసారిగా కనిపించింది. ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రాజీగా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం” అనే పాన్ ఇండియా పౌరాణిక చిత్రానికి ఓకే చెప్పి షూటింగ్ సైతం పూర్తి చేసింది. దీంతో ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయం చర్చనీయాంశంగా మారింది.
Read Also : మళ్ళీ పెళ్లి కూతురైన సమంత !
ఇటీవలే ఆమె డ్రీం వారియర్ బ్యానర్ కోసం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం సామ్ తన నెక్స్ట్ మూవీ కోసం శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కనున్న సినిమాకు సంతకం చేసింది. ఈ ప్రొడక్షన్ హౌస్ సుధీర్ బాబు, అదితి రావు హైదరి నటించిన “సమ్మోహనం”, నాని నటించిన “జెంటిల్‌మన్”, కళ్యాణ్ రామ్ “ఎంత మంచివాడావురా” చిత్రాలను నిర్మించింది. నిర్మాతలు బౌండ్ స్క్రిప్ట్‌తో వచ్చి సమంతను సంప్రదించారని, సమంత కథ బాగా నచ్చిందని అంటున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో సమంత ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన చేస్తుందని, నవంబర్ నుండి రాబోయే ఈ డ్రామా కోసం సమంత డేట్స్ కూడా కేటాయించినట్లు సమాచారం. ఇది ఉమన్ సెంట్రిక్ మూవీ అని అంటున్నారు.