Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా సరే దాని చుట్టూ ఏదో ఒక రచ్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, చేసే కామెంట్లు పెద్ద చర్చకు దారి తీస్తాయి. ఏం చేసినా.. చివరకు ఆమె విడాకుల గురించే కావచ్చేమో అనే ప్రశ్నలు కామన్. ఇప్పుడు ఆమె కొట్టిన ఒక లైక్ కూడా చివరకు ఆమె విడాకుల దాకా చర్చకు దారి తీసింది. ఆమె ఇన్ స్టాలో ఓ పోస్టుకు లైక్ కొట్టింది. ఆ పోస్టులో.. ‘భార్యకు అనారోగ్యం వస్తే భర్త వదిలించుకోవడానికే చూస్తాడు.. కానీ భర్తకు అనారోగ్యం వస్తే భార్య అస్సలు వదిలిపెట్టదు’ అని ఉంది. ఈ పోస్టుకు సమంత లైక్ కొట్టడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది.
Read Also : Rajamouli : రాజమౌళి రెమ్యునరేషన్ రూ.200 కోట్లు.. IMDB నివేదిక..
సమంతకు మయోసైటిస్ వ్యాధి సోకిన విషయం తెలిసిందే. ఆమె మూడేళ్లుగా దానితో ఇబ్బంది పడుతోంది. విడాకులు తీసుకున్నప్పుడే దీన్ని ఆమె బయటపెట్టింది. ఇప్పుడు ఆమె లైక్ కొట్టిన పోస్టుకు ఆమె వ్యాధికి లింక్ ఉందేమో.. అంటే సమంతకు మయోసైటిస్ సోకితే చైతూ పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరు విడాకులు తీసుకున్నారేమో అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సమంత ఏ ఉద్దేశంతో ఆ పోస్టుకు లైక్ కొట్టినా.. చివరకు ఆమె విడాకుల వరకు వెళ్లడం మరీ టూమచ్ గా ఉంది అంటూ ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. సమంత ప్రస్తుతం శుభం అనే సినిమాను నిర్మించింది. ఈ మూవీ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తోంది.