Samantha : స్టార్ హీరోయిన్ సమంత సినిమాల్లో నటించి చాలా రోజులు అవుతోంది. ఆమె చాలా రోజుల తర్వాత సొంతంగా ‘శుభం’ అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తోంది. వరుసగా ప్రమోషన్లు చేస్తూ మూవీపై హైప్ పెంచుతోంది సమంత. తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే అయినా.. నటనతో ఆకట్టుకున్నారని తెలిపింది. వారి నటన చూసి తన కెరీర్ స్టార్టింగ్ గుర్తుకు వచ్చినట్టు చెప్పుకొచ్చింది సమంత.
Read Also : LIC Kanyadan Policy: రోజుకు రూ. 121 పొదుపుతో.. రూ. 27 లక్షల లాభం!
‘వీళ్ల యాక్టింగ్ చూస్తుంటే నేను కెరీర్ మొదట్లో చేసిన సినిమాల్లో యాక్టింగ్ చూసి ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది. ఏమాయ చేసావే సినిమా ఇప్పుడు చూస్తే ఇంత దారుణంగా నటించానా అనిపిస్తుంది. ఇప్పటికీ యాక్టింగ్ లో కొత్తగా చేయడం నేర్చుకోవాలి. అది ప్రతి యాక్టర్ కు చాలా అవసరం. శుభం సినిమాను చూస్తే అనుభవం ఉన్న నటులు చేశారా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుభం సినిమాను ప్రవీణ్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీని మే 9న రిలీజ్ చేస్తున్నారు.