ప్రభుత్వ రంగ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసీ దేశ ప్రజల కోసం అద్భుతమైన పాలసీలను అందిస్తోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక గొప్ప పథకాలు ఉన్నాయి. తక్కువ పొదుపుతోనే ఎక్కువ రాబడిని అందిస్తాయి. ముఖ్యంగా కూతుళ్ల కోసం LIC చాలా ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఇవి వారి చదువు నుంచి వివాహం వరకు ఆర్థికంగా ఆదుకుంటాయి. ఆడపిల్లల కోసం ఎల్ఐసీ కన్యాదన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీలో రోజుకు రూ. 121 పొదుపు చేస్తే మెచ్యూరిటీ నాటికి ఏకంగా రూ. 27 లక్షలు చేతికి వస్తాయి.
Also Read:PBKS vs RCB: ఆర్సీబీ బౌలర్స్ అదరహో.. స్వల్ప స్కోరుకే పరిమితమైన పంజాబ్..
LIC కన్యాదన్ పాలసీ మీ కుమార్తె భవిష్యత్తును సురక్షితంగా ఉంచడమే కాకుండా, ఆమె వివాహ సమయంలో డబ్బు ఒత్తిడి నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. ఇందులో మీరు మీ కుమార్తె కోసం రోజుకు రూ. 121 డిపాజిట్ చేయాలి. అంటే మీరు ప్రతి నెలా మొత్తం రూ. 3,600 డిపాజిట్ చేయాలి. ఈ పెట్టుబడి ద్వారా, 25 సంవత్సరాల పాలసీ మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత మీరు ఒకేసారి రూ. 27 లక్షలకు పైగా పొందుతారు.
Also Read:Sanjay Raut: వారిద్దరిది భావోద్వేగం మాత్రమే.. ఇంకా రాజకీయ పొత్తు లేదు..
ఈ పాలసీని 13 నుంచి 25 సంవత్సరాల మెచ్యూరిటీ కాలానికి తీసుకోవచ్చు. మీ కుమార్తెకు రెండు సంవత్సరాల వయస్సు ఉండి, మీరు 25 సంవత్సరాలలో మెచ్యూరిటీ కోసం రూ. 10 లక్షల సమ్ అష్యూర్డ్ ప్లాన్ తీసుకొని, ఆ పథకంలో రోజుకు రూ. 121 పెట్టుబడి పెడితే, మీ కుమార్తెకు 27 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, ఆమెకు రూ. 27 లక్షలు వస్తాయి. ఈ పథకంలో లబ్ధిదారు తండ్రి వయస్సు కనీసం 30 సంవత్సరాలు, కుమార్తె వయస్సు కనీసం ఒక సంవత్సరం ఉండాలి.
Also Read:OnePlus 13: వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై రూ. 9 వేల డిస్కౌంట్.. కళ్లు చెదిరే ఫీచర్లు
LIC కన్యాదన్ పాలసీ ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కిందకు వస్తుంది, కాబట్టి ప్రీమియం చెల్లింపుదారులు రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పాలసీదారునికి మెచ్యూరిటీ కాలానికి ముందే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే లేదా అతను అకాలమరణం చెందితే.. కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల వరకు వస్తాయి. కుటుంబ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత మొత్తం రూ. 27 లక్షలు నామినీకి ఇవ్వబడతాయి. LIC కన్యాదాన పాలసీలో చేరడానికి మీ ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఇతర గుర్తింపు రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస రుజువు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, కుమార్తె జనన ధృవీకరణ పత్రాన్ని అందించాలి.