కొన్నిసార్లు అదృష్టం ఎలా కలిసివస్తుందో ఎవరికి తెలియదు. భర్త నాగ చైతన్యతో విడిపోయాకా సామ్ కి బాగానే కలసివచ్చింది. వరుసగా బాలీవుడ్ ఆఫర్లు.. గౌరవాలు.. ఇప్పటికే టాప్ సౌత్ ఇండియన్ హీరోయిన్లలో సమంత నెం 1 స్థానాన్ని భర్తీచేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సామ్ సొంతం చేసుకోబోతుంది. గోవా 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి సమంత గెస్ట్ గా వెళ్లనుంది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి ఇలాంటి గౌరవం దక్కలేదు. గోవాలో నవంబర్ 20 నుంచి వారం రోజలు పాటు జరగనున్న ఈ వేడుకలకు సామ్ ముఖ్య అతిధిగా వెళ్లనుంది. ఆమెతో పాటు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ టీమ్ కూడా ఆ వేడుకలలో సందడి చేయనున్నారు.
నటుడు మనోజ్ భాజ్ పాయ్, దర్శకులు అరుణ్ రాజే, వివేక్ అగ్ని హోత్రి, నటుడు జాన్ ఎడతతిల్ తదితరులు ప్రారంభోత్సవం రోజున కనిపించనున్నారు. అయితే ఈ ఆహ్వానం సామ్ కి రావడానికి ఒక్క ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో నటించడమే అనేది కారాన్తమ్ కాదని తెలుస్తోంది. బేసిక్ గా సమంత జంతు ప్రేమికురాలు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు సేవలు అందిస్తున్న మంచి మనసున్న మనిషి. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా మే ఎంతోమంది పిల్లలను సాకుతోంది. వీటన్నింటి వలనే ఈ అరుదైన గౌరవం ఆమెకు దక్కింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మరి..