Mrunal Thakur : బన్నీ సినిమాలో మృణాల్ ఛాన్స్.. రూమర్లపై ‘సీత’ క్రేజీ రియాక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం సౌత్.. నార్త్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ – అట్లీ మూవీ అనౌన్స్ చేసిన దగ్గరి నుండి ఈ మూవీలో మృణాల్ కూడా భాగం అయినట్లుగా వార్తలు వినపడుతున్నాయి. కానీ దీని గురించి అట్లి నుండి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇటీవల ఆమె దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన ‘భీగి భీగి’ మ్యూజిక్ వీడియో ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చింది మృణాల్ పాప. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మూవీలో నటిస్తోందనే వార్తలపై విలేకరులు ఆమెను ప్రశ్నించారు.
ఈ వార్తలపై మృణాల్ నవ్వుతూ స్పందిస్తూ.. ‘అవునా? నిజంగానే నా పేరు వినపడుతోందా? నాకైతే ఇప్పటి వరకు అలాంటి సమాచారం రాలేదు. కానీ మీరందరూ ప్రార్థించండి.. అదే నిజమైతే మనమందరం కలిసి పెద్ద సెలబ్రేషన్ చేసుకుందాం’ అంటూ సరదాగా సమాధానమిచ్చారు. దీనితో ప్రస్తుతానికి ఆ సినిమాలో తాను లేనని ఆమె పరోక్షంగా స్పష్టం చేశారు. అయితే, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో పని చేసే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోనని, ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం మృణాల్ హిందీలో ‘దో దివానే షెహర్ మే’, ‘డకాయిట్’ వంటి క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. తెలుగులో కూడా మరికొన్ని కొత్త కథలను వింటున్నట్లు సమాచారం. రూమర్స్ ఎలా ఉన్నా, బన్నీ – మృణాల్ జోడీ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
Also Read
- TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
- Akhil NRD: "ప్రేమ పెళ్లి".. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!