బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్ నెస్ మెయింటైన్ చేసే ఈ హీరో ఒక ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడట. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా అందరిముందు చెప్పడం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిట్ నెస్ విషయంలో నిత్యం రాజీపడని సల్మాన్ ని బాధపెడుతున్న ఆ వ్యాధి పేరు.. ‘ట్రిజెమినల్ న్యూరల్జియా’. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో ఇది ఒకటని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే.. నరాల సమస్య వల్ల కలిగే ఈ వ్యాధి వల్ల ఎక్కువ సేపు మాట్లాడితే మూతి వంకర్లు పోతుంది.. దానివలన ముఖం చాలా నొప్పిని భరించలేకుండా వుంటుందట.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సల్మాన్ తన వ్యాధి గురించి బయటపెట్టాడు. ” ఈ వ్యాధి వలన నేను నరకం అనుభవిస్తున్నాను. ఎక్కువసేపు మాట్లాడలేక పోయేవాడిని..ముఖం అంతా బాగా నొప్పి వచ్చేది .. మూతి వంకర్లు పోయి మాట్లాడడం కూడా కష్టమయ్యేది. బ్రష్ చేసుకున్న, మేకప్ వేసుకున్న నొప్పి తీవ్రంగా ఉండేది. కొన్నిసార్లు ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ ఇప్పుడిప్పుడే నేను ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నాను. ఈ వ్యాధికి అమెరికాలో చికిత్స తీసుకొంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సల్మాన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. పైకి కండల వీరుడు గా కనిపిస్తున్నా లోపల ఎంతటి బాధను అనుభవిస్తున్నాడో సల్లు భాయ్ అని అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.