పాన్ ఇండియా బాక్సాఫీస్ ని జవాన్ సినిమా మేనియా పూర్తిగా కమ్మేసింది. షారుఖ్ ఖాన్ సౌత్ స్టైల్ ప్రాపర్ కమర్షియల్ డ్రామాలో కనిపించడంలో బాలీవుడ్ ఆడియన్స్… 1970ల నుంచి ఇప్పటివరకూ ఇలాంటి కమర్షియల్ డ్రామాని చూడలేదు అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. మొదటి రోజు 129 కోట్లకి పైన ఓపెనింగ్ రాబట్టిన జవాన్ సినిమా ఓవరాల్ గా పఠాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేలా ఉంది. ఈ ఏడాదే రిలీజ్ అయిన పఠాన్ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పుడున్న టాక్ అండ్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే జవాన్ సినిమా పఠాన్ రికార్డ్స్ ని ఈజీగా బ్రేక్ చేయడం గ్యారెంటీ. జవాన్ సినిమాకి సౌత్ కలెక్షన్స్ కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి 1200 కోట్ల వరకూ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే పఠాన్ రికార్డ్స్ ని జవాన్ బ్రేక్ చేసాడు… మరి జవాన్ రికార్డ్స్ ని ఎవరు బ్రేక్ చేస్తారు అనేది ఆలోచిస్తే… బాలీవుడ్ లో ఆ పొటెన్షియల్ ఉన్న ఏకైక హీరోగా సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నాడు.
నవంబర్ నెలలో బాక్సాఫీస్ ని చెల్లా చెదురు చేయడానికి సల్మాన్ ఖాన్ టైగర్ గా వస్తున్నాడు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. టైగర్ 3 కోసం సల్మాన్ ఫాన్స్ మాత్రమే కాదు షారుఖ్ ఖాన్ ఫాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పఠాన్ సినిమాలో సల్మాన్ క్యామియో ప్లే చేసినట్లే, టైగర్ 3లో షారుఖ్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడు. ఈ మొత్తం సీక్వెన్స్ టైగర్ vs పఠాన్ సినిమాకి లీడ్ ఇచ్చేలా ఉంటుంది. ఇద్దరు సూపర్ స్టార్ లు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో పఠాన్ సినిమా శాంపిల్ చూపించింది కాబట్టి ఇప్పుడు టైగర్ 3 సినిమాపైన అంచనాలు మరింత పెరిగాయి. టైగర్ 3 టీజర్, ట్రైలర్ బయటకి వస్తే చాలు బాలీవుడ్ లో కొన్ని రోజుల పాటు వేరే ఏ సినిమా మాట కూడా వినిపించదు. ఆ రేంజ్ హైప్ మైంటైన్ చేస్తున్న టైగర్ 3 సినిమా జవాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు, పైగా షారుఖ్ ఖాన్ కూడా ఉంటాడు కాబట్టి టైగర్ 3 బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడం గ్యారెంటీ.