ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్, బాలీవడ్ బాద్షా కింగ్ ఖాన్ ఎపిక్ వార్ కి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర యుద్ధానికి సిద్ధమయ్యారు. సలార్ డిసెంబర్ 22న, డంకీ డిసెంబర్ 21న రిలీజ్ కానున్నాయి. నిజానికి రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వాల్సి ఉండగా డంకీ సినిమా క్లాష్ ని అవాయిడ్ చేస్తూ ఒక రోజు ముందే విడుదల కానుంది. షారుఖ్, ప్రభాస్ ల మధ్యే కాదు ఈ బాక్సాఫీస్ వార్ మరింత ఇంటెన్స్ గా మారడానికి ఈ రెండు సినిమాల దర్శకులు కూడా కారణమే. సలార్ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. KGF సినిమాతో రాజమౌళి తర్వాత ఆ స్థాయి దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పేరు తెచ్చుకున్నాడు. అలాంటి డైరెక్టర్ కి ప్రభాస్ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలి అనే ఉత్సాహం సినీ అభిమానుల్లో ఉంది. ప్రభాస్ కటవుట్ కి సరిపోయే కథని ప్రశాంత్ నీల్ ఇస్తే చాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం గ్యారెంటీ.
ఇక డంకీ సినిమాని డైరెక్ట్ చేస్తూ రాజ్ కుమార్ హిరాణీ. ఇండియాలోనే ఫ్లాప్ ఫేస్ చెయ్యని అతి తక్కువ మంది దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాణీ ఒకడు. నాన్ కమర్షియల్ పాయింట్ ని, ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చునే చేయడం రాజ్ కుమార్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఈ డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే హీరో ఎవరు అనేది సెకండరీ టాపిక్ అవుతుంది. అలాంటి రాజ్ కుమార్ ని ప్రైమ్ ఫార్మ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ కలవడంతో డంకీ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరో రెండు వారాల్లో ఆడియన్స్ ముందుకి రానున్నా ఈ సిన్మాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం కన్నా ముందు ట్రైలర్స్ తో పోటీ పడ్డాయి. సలార్ ట్రైలర్ 24 గంటల్లో 108 మిలియన్ వ్యూస్ రాబడితే డంకీ ట్రైలర్ 24 గంటల్లో కేవలం 60 మిలియన్ వ్యూస్ ని మాత్రమే రాబట్టింది. దదాపు హాఫ్ మార్జిన్ తో సలార్ ట్రైలర్ క్లీన్ విన్నర్ గా నిలిచింది. మరి డిసెంబర్ 21 అండ్ 22న జరగనున్న బాక్సాఫీస్ క్లాష్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.