ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగబోతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సలార్, డంకీ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ప్రభాస్ దెబ్బకి షారుఖ్ ఖాన్ గల్లంతు అవుతాడని సౌత్ వాళ్లు… కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని నార్త్ వాళ్లు వెర్బల్ వార్ కి దిగారు. ఈ వెర్బల్ వార్ కి ఎండ్ కార్డ్ వేస్తే షారుఖ్ ఖాన్ డంకీ సినిమా వాయిదా పడింది అనే రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డిలే కారణంగా డంకీ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కావట్లేదని బాలీవుడ్ వర్గాల్లో కూడా వినిపిస్తున్న టాక్. ఈ వార్త బయటకి రాగానే సలార్ దెబ్బకి డంకీ భయపడింది. షారుఖ్ వెనక్కి తగ్గాడు అనే కామెంట్స్ మొదలయ్యాయి.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం డంకీ సినిమా వాయిదా పడే అవకాశమే లేదట. డంకీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని షారుఖ్ సొంత రెడ్ చిల్లీస్ సంస్థ చేస్తుంది. సో షారుఖ్ కి డంకీ విషయంలో ఏం జరుగుతుంది అనే విషయం క్లియర్ కట్ గా తెలుసు. అందుకే డంకీ సినిమా డిసెంబర్ 22న వస్తుందని షారుఖ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. షారుఖ్ ఖాన్ డంకీ సినిమాని వాయిదా వేయడం అనేది దాదాపు జరగకపోవచ్చు. ఈ ఇయర్ లోనే రెండు వేల కోట్లు రాబట్టిన షారుఖ్ ఖాన్ డిసెంబర్ 22 నుంచి వెనక్కి తగ్గడు, సరైన మాస్ సినిమా చేస్తున్న ప్రభాస్ కూడా వెనక్కి తగ్గడు. ఈ ఇద్దరూ బాక్సాఫీస్ వార్ సై అనే అంటారు. అలా పోటీ పడడం అభిమానులకి మంచిదే కానీ సినిమాలు మాత్రం కాదు. ఒక సినిమా ఇంపాక్ట్ ఇంకో సినిమా పైన తప్పకుండా ఉంటుంది. సో ఎవరో ఒకరు వాయిదా వేసుకోవడం మంచిది.