సలార్ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ లో, సోషల్ మీడియాలో చాలా డౌట్స్ కనిపిస్తున్నాయి. మూడున్నర నిమిషాల ట్రైలర్ లో ప్రభాస్ రెండున్నర నిమిషం తర్వాత కనిపించాడు. ఆ తర్వాత ప్రభాస్ ర్యాంపేజ్ ని ప్రశాంత్ నీల్ మాస్ గా చూపించాడు అది వేరే విషయం కానీ ట్రైలర్ లో లేట్ గా కనిపించిన ప్రభాస్… సలార్ సినిమాలో ఎప్పుడు కనిపిస్తాడు అనేది ఇప్పుడు అతిపెద్ద డౌట్ గా మారింది. సలార్ సినిమాలో ప్రభాస్ కి ఫ్రెండ్ గా, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు పృథ్వీ రాజ్ సుకుమారన్. మలయాళంలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న పృథ్వీ పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అలాంటి హీరోని తీసుకోని వచ్చి ప్రశాంత్ నీల్ చిన్న క్యారెక్టర్ అయితే ఇచ్చి ఉండడు, పైగా జగపతి బాబు ఈ సినిమాలో నటించింది ఏడు రోజుల పాటే. సో జగపతి బాబు ఎక్కువ సేపు ఉండడు కానీ పృథ్వీ రాజ్ స్క్రీన్ పైన చాలా సమయం కనిపిస్తాడు. ఉగ్రమ్ సినిమాలో కూడా హీరోతో సమానంగా హీరో ఫ్రెండ్ రోల్ ఉంటుంది. ఆ వరల్డ్ ని పరిచయం చేసిన తర్వాత హీరో ఇంట్రడక్షన్ అవుతుంది. ఇప్పుడు సలార్ కూడా అదే జరిగితే ఏంటి పరిస్థితి అనేది అందరి అనుమానం.
కాన్సార్ వరల్డ్ ని పరిచయం చేసి, క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి, పృథ్వీ రాజ్-జగపతి బాబుల ఎంట్రీ తర్వాత ప్రభాస్ ఇంట్రడక్షన్ ఉంటే అప్పటికే చాలా సమయం అయిపోతుంది. ప్రభాస్ ని చూడడానికి థియేటర్స్ కి వెళ్లే అభిమానులు అంత సేపు ఓపికగా కూర్చుంటారా అనేది చూడాలి. ప్రశాంత్ నీల్ కూడా ఇలాంటి రిస్క్ తోసుకోని ప్రభాస్ ని లేట్ గా స్క్రీన్ పైకి తీసుకోని రాకపోవచ్చు. ప్రభాస్ పైన చేసిన సినిమా కాబట్టి ప్రభాస్ ఎక్కువ సమయమే కనిపిస్తాడు అనడంలో సందేహం లేదు. అయితే పార్ట్ 2 ఉంది కాబట్టి ప్రభాస్ ని లేట్ గా ఇంట్రడ్యూస్ చేసి… సీజ్ ఫైర్ ఎండ్ లో ప్రభాస్ ఫాథర్ క్యారెక్టర్ ని తీసుకోని వస్తే మాత్రం సినిమా స్టార్టింగ్ లో ఏం జరిగినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోక పోవచ్చు. మరి ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేసాడు? ప్రభాస్ ని పృథ్వీరాజ్ ప్రపంచంలోకి ఎంత త్వరగా తెస్తాడు అనేది చూడాలి.