ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్… ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా పేరు తెచ్చుకోని మరి కొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. మచ్ అవైటెడ్ సలార్ సినిమా ప్రీమియర్స్ ఈరోజు దాదాపు అన్ని సెంటర్స్ లో పడనున్నాయి. ఓవర్సీస్ లో సలార్ ఫస్ట్ ప్రీమియర్ పడనుంది, తెలుగులో అర్ధరాత్రి 1కి సలార్ ఫస్ట్ షో పడనుంది. సుర్యూడు పూర్తిగా బయటకి వచ్చే లోపు సలార్ టాక్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవ్వనుంది. టికెట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ థియేటర్స్, బుక్ మై షో ఓపెన్ చేసి హడావుడి చేస్తున్నారు. అయితే హిందీలో సింగల్ స్క్రీన్ ఇష్యూ కారణంగా సౌత్ లో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్ చైన్స్ కి బుకింగ్స్ ఇవ్వలేదు. ఈ చైన్స్ కి కంటెంట్ ఆపేసి, నార్త్ లో ఇస్తేనే సౌత్ లో కంటెంట్ ఇస్తామని మేకర్స్ చెప్పడంతో… బుక్ మై షోలో ఇంకా సలార్ పీవీఆర్, మిరాజ్ సినిమాస్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు.
ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాయ్కాట్ పీవీఆర్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు కావాల్సింది నెగటివ్ ట్రెండ్ కాదు బుకింగ్స్ ఓపెన్ అవ్వడం. నిజానికి నిన్న రాత్రే ఈ సమస్యకి ఒక పరిష్కారం వస్తుందని అంతా అనుకున్నారు కానీ ఇప్పటికీ ఈ ఇష్యూ ఒక కొలిక్కి రాలేదు. ఈ కారణంగా సౌత్ లో సలార్ చేతిలో ఎక్కువ థియేటర్స్ లేవు. కేవలం హైదరాబాద్ లోనే సలార్ కన్నా డంకీ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి అంటే పీవీఆర్, మిరాజ్ సినిమాస్ తో ఈ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనే విషయం తెలుస్తుంది. పీవీఆర్, మిరాజ్ సినిమాస్ తో కాకపోయినా ఆల్టర్నేట్ గా ఏదైనా పరిష్కారం అలోచించి హోంబలే ఫిల్మ్స్ ఎక్కువ థియేటర్స్ లో బుకింగ్స్ ఓపెన్ చెయ్యాలి. ఇది ఎంత త్వరగా జరిగితే సలార్ బుకింగ్స్ అంత ఎక్కువగా పెరుగుతాయి.