సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడిన సలార్ సినిమా బాక్సాఫీస్ కన్నా ముందు సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. మచ్ అవైటెడ్ సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ బయటకి వస్తే సలార్ రేంజ్ ఏంటో ఆడియన్స్ కి క్లియర్ గా అర్ధమవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం “సలార్ లెక్కల్లో మార్పు ఉండదు.. ఓపెనింగ్స్ రికార్డుల్లో ఒక్కటి మిగలదు”… అని డిసెంబర్ 22 కోసం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు అభిమానులు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్ 1 నుంచి సలార్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరగనున్నాయి. సలార్ హైప్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో ఆకాశాన్ని తాకుతుంది. డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేసుకుంటూ వెళ్తే… డిసెంబర్ 22 రోజున బాక్సాఫీస్ దగ్గర భూకంపం వస్తుంది.
సలార్ ట్రైలర్ ఊపు కనీసం వారం రోజులు ఉంటుంది. ఆ తర్వాత రెండు సాంగ్స్ ని బ్యాక్ టు బ్యాక్ వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ చేస్తే మూడు వారాల పాటు సాలిడ్ కంటెంట్ ని రిలీజ్ చేసినట్లే. అలాగే డిసెంబర్ మూడో వారంలో స్టార్టింగ్ లో సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ను నిర్వాహకులు తట్టుకుంటారా? అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్? ఎందుకంటే… జస్ట్ సలార్ గురించి ఏదైనా ట్వీట్ పడితేనే సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. అలాంటిది ఈవెంట్ అంటే… ఫ్యాన్స్ తాకిడి సునామీ వచ్చినట్లు ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో కలిసి చాలా రోజులే అయ్యింది కాబట్టి ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ రావడం గ్యారెంటీ. మరి అంత గ్రాండ్ ఈవెంట్ ని ఎక్కడ ప్లాన్ చేస్తారో చూడాలి.