సలార్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే… రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారు ప్రభాస్ ఫ్యాన్స్. 250, 200, 150, 100, 50 రోజులు అంటూ కౌంట్ డౌన్ చేస్తునే ఉన్నారు. ఫైనల్‌గా సలార్ తుఫాన్ తీరం తాకే సమయం ఆసన్నమైంది. మరో నాలుగు వారాల్లో బాక్సాఫీస్‌ను కమ్మేయనుంది సలార్ తుఫాన్. డిసెంబర్ 22 బాక్సాపీస్ దగ్గర జరగబోయే తుఫాన్ భీభత్సం మామూలుగా ఉండదు కానీ డిసెంబర్ 1న శాంపిల్‌గా తీరాన్ని తాకనుంది సలార్ తుఫాన్. ఎప్పుడెప్పుడా అని…
సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడిన సలార్ సినిమా బాక్సాఫీస్ కన్నా ముందు సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. మచ్ అవైటెడ్ సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ బయటకి వస్తే సలార్ రేంజ్ ఏంటో ఆడియన్స్ కి క్లియర్ గా అర్ధమవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం “సలార్ లెక్కల్లో మార్పు ఉండదు.. ఓపెనింగ్స్ రికార్డుల్లో ఒక్కటి మిగలదు”… అని డిసెంబర్ 22 కోసం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు అభిమానులు. అన్నీ…
గత 24 గంటలుగా సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి సలార్, ప్రభాస్, సలార్ సీజ్ ఫైర్ ట్యాగ్స్. పది రోజుల్లో సలార్ ట్రైలర్ రిలీజ్ అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెరిగింది. దీంతో ప్రభాస్ ఫోటోలని పోస్ట్ చేస్తూ టాప్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ‘సలార్ ర్యాంపేజ్ ఇన్ ఏ మంత్’ అనే ట్రెండ్ ని ప్రభాస్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ చేస్తున్నారు. ఈరోజు నవంబర్ 22… సరిగ్గా నెల…