ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రాబోతుంది సలార్ సినిమా. ఈరోజు అర్ధరాత్రి నుంచే సలార్ ప్రీమియర్స్ స్టార్ట్ అవనున్నాయి. ఫ్యాన్స్ హంగామాతో ఇప్పటికే సలార్ ఫెస్టివల్ మోడ్ ఆన్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో షోస్ చూడడానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకే హ్యూజ్ బజ్ ఉంటుంది, ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా కలవడంతో హైప్ ఆకాశాన్ని తాకుతోంది. డ్రై సీజన్ లాంటి డిసెంబర్ లో కూడా సలార్ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే యుఎస్ మార్కెట్ లో సలార్ సినిమా 2 మిలియన్ మార్క్ కి చేరువలో ఉంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ఖాతాలో మరో వంద కోట్ల ఓపెనింగ్ డే రికార్డ్ ని సాదించబోతుంది సలార్ సినిమా.
ఇది రేర్ ఫీట్ అనే చెప్పాలి. అయితే సలార్ సినిమా 345 కోట్ల ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ జరుపుకుంది. 347 కోట్ల రూపాయలు వస్తే సలార్ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయినట్లే. ప్రస్తుతం సలార్ పై ఉన్న హైప్ అండ్ బుకింగ్స్ చూస్తుంటే సలార్ బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. నెలలు కూడా పట్టదు హిట్ టాక్ పడితే చాలు సలార్ సినిమా ఫస్ట్ మండేకే బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యి అన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవుతుంది. సో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే విషయంలో సలార్ సినిమాపై ట్రేడ్ వర్గాల నుంచి కామన్ ఆడియన్స్ వరకూ ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.