Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. కెజిఎఫ్ తో భారీ విజయాన్ని అందుకున్న హోంబలే ఈ చిత్రాన్ని నిర్మించింది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. డిసెంబర్ 22 న రిలీజ్ అయిన సలార్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రభాస్ బాహుబలి తరువాత అందుకున్న అతిపెద్ద విజయం అంటే సలార్ అనే చెప్పాలి. ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో సలార్ సీజ్ ఫైర్ సినిమా చూపించింది. ఇప్పటివరకు రూ. 625 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. సలార్ దేవరథ రైజర్ గా ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఖాన్సార్ లో దేవ- వరద స్నేహం.. పగగా ఎలా మారింది అనేదే సలార్ కథ. ఇక ఈ బ్లాక్ బస్టర్ హిట్ ను మేకర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు.
Animal Success Party : యానిమల్ సక్సెస్ పార్టీలో అలియా భట్ ధరించిన డ్రెస్స్ ఖరీదు ఎంతో తెలుసా?
తాజాగా సలార్ బ్లాక్ బస్టర్ హిట్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొని కేక్ ను కట్ చేశారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హోంబలే నిర్మాతలు కలిసి కేక్ కట్ చేశారు. చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ ఈ సెలబ్రేషన్స్ లో కనిపించదు. ఎప్పటిలానే ఇప్పుడు కూడా ప్రభాస్ బ్లాక్ అండ్ బ్లాక్ లోనే దర్శనమిచ్చాడు. బ్లాక్ కలర్ హూడీ పై బ్లాక్ కలర్ హెయిర్ క్యాప్ వైట్ గ్లాసెస్ తో కూల్ లుక్ లో కనిపించగా.. పృథ్వీరాజ్ సైతం బ్లాక్ కలర్ షర్ట్ లో మెరిశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
The blockbuster success calls for a BLOCKBUSTER CELEBRATION! 💥 #SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG #HombaleMusic @IamJagguBhai… pic.twitter.com/VtusBDbBgJ
— Salaar (@SalaarTheSaga) January 8, 2024