Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. పాన్ ఇండియా సినిమాల్లో విలన్ గా చేస్తూ సౌత్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మొన్న ఆయన ఇంట్లో ఓ దుండగుడు దాడి చేయడంతో దేశ వ్యాప్తంగా సైఫ్ గురించే చర్చ జరిగింది. ఆ దాడిలో సైఫ్ కు భారీ గాయాలయ్యాయి. ఈ క్రమంలో సైఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఖతర్ దేశంలో పెద్ద ఇల్లు కొనేశాడు. ఈ విషయాన్ని ఆయనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఖతర్ దేశంలో నా ఇల్లు హాలిడే హోమ్. ఇక్కడి నుంచి చాలా త్వరగా వెళ్లిపోవచ్చు. పైగా అక్కడ సేఫ్టీ ఎక్కువ. చాలా అందమైన దేశం. అక్కడ ఉంటే చాలా పీస్ ఫుల్ గా అనిపిస్తుంది’ అంటూ తెలిపాడు.
Read Also:Kamal Haasan: త్రిష తో బనానా జోక్.. ఈ వయసులో అవసరమా?
‘మొన్న ఓ మూవీ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడ పరిసరాలను చూస్తే చాలా బాగుంది. వెంటనే ఇల్లు కొనేయాలి అనిపించింది. అక్కడ డిస్టబెన్స్ పెద్దగా ఉండదు. చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. నా ఫ్యామిలీని కూడా త్వరలో అక్కడికే షిఫ్ట్ చేసేస్తా. ఇప్పటి వరకు నాకు బయటి దేశాల్లో పెద్దగా ఇళ్లు లేవు. ఇప్పుడే ఖతర్ లో తీసుకున్నా. మనకు నచ్చినట్టు బతకడంలో తప్పులేదు. కాబట్టి అక్కడ ఇల్లు కొనేశాను’ అంటూ తెలిపాడు సైఫ్ అలీఖాన్. ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. విలన్ పాత్రలతో పాటు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు.