మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ పై పలు విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ‘భోళా శంకర్’ సినిమా విడుదలకు ముందు నిర్మాత అనిల్ సుంకర వద్ద చిరంజీవి తన పారితోషికం అంతా వసూలు చేశారని సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది. చిరంజీవి పారితోషకం ఇవ్వడానికి నిర్మాత అనిల్ సుంకర తనకు వున్న ల్యాండ్ ను తనకా పెట్టి మరి డబ్బులు అడ్జస్ట్ చేసారని సోషల్ మీడియాలో ఈ రూమర్ తెగ ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్ ని ఖండిస్తూ చిరంజీవి వీరాభిమాని, ‘బేబీ’ సినిమా దర్శకుడు అయిన సాయి రాజేష్ చాలా క్లియర్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.
చిరంజీవి గారి గురించి ఆరోపణలు చేయడం ఆపండి, సినిమా బాగోలేకపోతే బాగోలేదు అని చెప్పండి, అంతే కానీ సినిమాలో నటించిన చిరంజీవి గారి మీద లేనిపోనీ నిందలు వేయొద్దు అంటూ ఆయన రాసుకొచ్చారు. అలాగే ఈ వార్తలపై సాయి రాజేష్ బాగా మండిపడ్డారు.. మేము మెగాస్టార్ చిరంజీవి గారి ఆఫీస్ లో ఉన్నప్పుడు అనిల్ సుంకర గారు వస్తే ఆయన్ని వెయిట్ చేస్తున్నాడని తెలిసీ ఆయనను పిలిచి పైకి రాగానే ఆయనే ఐరెన్ సోఫా జరిపి మరీ కూర్చోబెట్టారు. పని మనిషి తీసుకొచ్చిన కాఫీని స్వయంగా మా ముగ్గురికి అందించారు. నిర్మాతలకి ఆయనిచ్చే రెస్పెక్ట్ అలాంటిది.ఆయనపై వస్తున్న వార్తలని చూసి ఎంతో బాధతో నేను అనిల్ గారు దగ్గర పని చేసే ఒక వ్యక్తికి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాను. మా చిరంజీవి గారు వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికి తెలుసు.మా చిరంజీవి గారిని చూసి నేను గర్వపడుతున్నాను అంటూ సాయి రాజేష్ ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది.