Sai Pallavi: అరుదైన రికార్డ్.. హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు కథానాయికలు ఏళ్ళ తరబడి ప్రయత్నించినా.. తమదైన ముద్ర వేయలేక తంటాలు పడుతూనే ఉంటారు. పెద్ద పెద్ద సినిమాలు చేసినా సరే, వారికంటూ ఒక గుర్తింపు అంత త్వరగా దొరకదు. కానీ.. సాయి పల్లవి మాత్రం మొదటి సినిమా నుంచే అందరి మనసులు దోచుకోవడం మొదలుపెట్టింది. అందం పరంగా కాదు.. నటన పరంగా! ట్యాలెంట్ ఉంటే అందంతో పని లేదని ఈ నేచురల్ నటి నిరూపించింది. అందరిలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేయలేదు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని మాత్రమే ఒప్పుకుంది. స్టార్స్‌తో నటించే అవకాశం వచ్చినా, పాత్రకు ప్రాధాన్యం లేకపోతే తిరస్కరించింది.
అలా సెలెక్టెడ్‌గా మంచి పాత్రలు చేయడం వల్లే.. సాయి పల్లవిని అవార్డులు వరుసగా వరిస్తున్నాయి. తాజాగా సాయి పల్లవికి శ్యామ్ సింగ రాయ్‌లో పోషించిన దేవదాసి పాత్రకు గాను గోల్డ్ మెడల్ దక్కింది. ఆ పాత్రలో సాయి పల్లవి ఎంత గొప్ప ప్రతిభ కనబర్చిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ద్వితీయార్థంలో నానికి సమానంగా రాణించి, అందరి మనసుల్ని దోచుకుంది. అందుకే.. బిహైండ్ వుడ్స్ అవార్డ్స్‌లో బంగారు పతకం సొంతం చేసుకుంది. ఇలాంటి అవార్డ్ ఈమెకు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ రెండు దక్కించుకుంది. మొదటిసారి 2017లో కాళి సినిమాకు గాను మొదటిసారి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది.
Also Read
ఆ తర్వాత 2019లో మలయాళంలో ఫహాద్ ఫాజిల్ చేసిన అథిరన్ సినిమాకి గాను రెండో గోల్డ్ మెడల్ అందిపుచ్చుకుంది. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్‌కు ముచ్చటగా మూడో అవార్డ్ తీసుకుంది. ఒక దక్షిణాది నటి ఇంత తక్కువ సమయంలోనే మూడు గోల్డ్ మెడల్స్‌ను సొంతం చేసుకున్న దాఖలాలు చరిత్రలోనే లేదు. తొలిసారి ఈ అరుదైన ఘనత సాధించింది సాయి పల్లవినే!
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!