కొందరు కథానాయికలు ఏళ్ళ తరబడి ప్రయత్నించినా.. తమదైన ముద్ర వేయలేక తంటాలు పడుతూనే ఉంటారు. పెద్ద పెద్ద సినిమాలు చేసినా సరే, వారికంటూ ఒక గుర్తింపు అంత త్వరగా దొరకదు. కానీ.. సాయి పల్లవి మాత్రం మొదటి సినిమా నుంచే అందరి మనసులు దోచుకోవడం మొదలుపెట్టింది. అందం పరంగా కాదు.. నటన పరంగా! ట్యాలెంట్ ఉంటే అందంతో పని లేదని ఈ నేచురల్ నటి నిరూపించింది. అందరిలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేయలేదు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని…