‘విరాట పర్వం’ తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. చివరగా ‘గార్గి’ అనే డబ్బింగ్ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరిచింది. ఆ తర్వాత ఒక్క తెలుగు సినిమాని కూడా సాయి పల్లవి కమిట్ అవలేదు. దీంతో అమ్మడు ఇక సినిమాలు మానేస్తుంది… వైద్య రంగంలో సెటిల్ అయిపోతుందని ప్రచారం జరిగింది. ఇంతలో తమిళ్‌లో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమా అనౌన్స్ చేసింది. తమిళ సినిమాలు చేస్తుంది మరి తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదని తెగ ఫీల్ అయిపోయారు ఆమె అభిమానులు. సరైన స్క్రిప్ట్ కుదరక పోవడం వల్లే పల్లవి అలా చేస్తోందని వినిపించింది. ఇన్ని రోజుల తర్వాత ఫైనల్‌గా ఓ తెలుగు సినిమాకు సంతకం చేసేసింది ఈ క్యూట్ బ్యూటీ. గతంలో నాగ చైతన్యతో కలిసి ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటించిన సాయి పల్లవి… మరోసారి చైతన్యతో రొమాన్స్ చేసేందుకు ఓకె చెప్పింది.
ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో కలిసి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు నాగ చైతన్య. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ #NC23 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం… ఇప్పటికే జాలర్లని కలిసింది చిత్ర యూనిట్. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమాలో సాయి పల్లవి కూడా జాయిన్ అయిపోయింది. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేసిన మేకర్స్… సాయి పల్లవి ఫేస్ చూపించకుండా సస్పెన్స్‌లో ఉంచారు కానీ ఆమె కటౌట్ చూస్తే సాయి పల్లవి అని ఈజీగా చెప్పేస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి.
The widely adored and loved lady joins the voyage of #NC23 🌊⛵#ShejoinstheNC23Voyage
Yuvasamrat @chay_akkineni @chandoomondeti #BunnyVas @GeethaArts #KarthikTheda pic.twitter.com/5Uusax4g4g
— Geetha Arts (@GeethaArts) September 19, 2023