సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘విరూపాక్ష’. సాలిడ్ హిట్ గా అయిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 21న థియేటర్లోకి వచ్చిన విరూపాక్ష సినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టి, తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఏజెంట్, శాకుంతలం లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేయండంతో.. విరూపాక్షకి లాంగ్ థియేట్రికల్ రన్ దొరికింది. దీంతో విరూపాక్ష సమ్మర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా 2023లో హయ్యెస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్స్ లో ఒకటిగా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. తెలుగు లాభాలు తెచ్చిపెట్టిన విరుపాక్ష మూవీ, తమిళ్ మలయాళ హిందీ భాషల్లో మాత్రం అసలు ఇంపాక్ట్ చూపించలేక పోయింది.
ఇతర భాషల్లో విరుపాక్ష సౌండ్ అసలు వినిపించలేదు. థియేట్రికల్ రన్ అన్ని భాషల్లో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్ అయితే నెల రోజులు, ఫట్ అయితే రెండు, మూడు వారాలే గ్యాప్ ఇస్తున్నాయి ఓటిటి సంస్థలు. అయితే విరూపాక్ష బ్లాక్ బస్టర్ బొమ్మ కాబట్టి.. సరిగ్గా నెల రోజులకు ఓటిటిలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ముందుగా తెలుగులో మే 21 నుంచి విరూపాక్ష డిజిటల్ స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. “అసలైన భయం సినిమాలో ఉంది” అంటూ నెట్ ఫ్లిక్స్ విరూపాక్ష స్ట్రీమింగ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. మరి ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన విరుపాక్ష మూవీ, ఓటిటిలో విరూపాక్ష ఎలా అలరిస్తుందో చూడాలి.
Bhayapadakandi. Idhi just update maathrame. Assalaina bhayam cinemalo undhi💀#Virupaksha is now streaming on Netflix.
— Netflix India South (@Netflix_INSouth) May 20, 2023