సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చేస్తున్న సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో SVCC ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 21న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీపై మెగా ఫాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన విరూపాక్ష సినిమాని మేకర్స్ కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. గ్లిమ్ప్స్ కోసం ఎన్టీఆర్ ని రంగంలోకి దించిన చిత్ర యూనిట్, టీజర్ కోసం పవన్ కళ్యాణ్ ని వాడారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు విరూపాక్ష సినిమా ప్రమోషనల్ కంటెంట్ ని లాంచ్ చెయ్యడంతో సినిమాకి మంచి రీచ్ వచ్చింది. ఇతర హీరోలని ప్రమోషన్స్ కోసం వాడుతూనే తమ సినిమాలో కొత్త విషయాలు ఏం ఉన్నాయో ఆడియన్స్ కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. గతంలో ఒక గుడి, అఘోర గుహకి సంబంధించిన వీడియోస్ ని రిలీజ్ చేసిన మేకర్స్, లేటెస్ట్ గా విరూపాక్ష సినిమా కోసం స్పెషల్ గా వేసిన హౌజ్ సెట్ కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు.
రెండు వేరియేషన్స్ ఉండే పాడుబడిన హౌజ్ సెట్ తో పాటు ఒక భారి చెట్టు సెట్ ని కూడా రెడీ చేశారు. విరూపాక్ష సినిమా ఎక్కువ శాతం ఈ హౌజ్ సెట్ లోనే జరుగుతూ ఉండడంతో అర్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోని మరీ ఈ సెట్ ని నిర్మించారు. వరల్డ్ ఆఫ్ విరూపాక్షలో మూడో వీడియోగా బయటకి వచ్చిన ఈ కంటెంట్ చూస్తే హారర్ ఫీల్ రావడం పక్కా. వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియోకే ఇలా ఉంటే థియేటర్ లో చూసినప్పుడు ఇంట్లో షూట్ చేసిన ఎపిసోడ్స్ ని చూస్తే గూస్ బంప్స్ వస్తాయేమో. గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో విరూపాక్ష ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మరి ఏప్రిల్ 21న సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో పాన్ ఇండియా రేంజ్ మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి.
Here's the Scary & Intriguing Volume – 3
"Abandoned House" from the World of Virupaksha 💥–https://t.co/THBmALY7BZ@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @NavinNooli @bkrsatish @SVCCofficial @SukumarWritings#Virupaksha#VirupakshaOnApril21 pic.twitter.com/vm0AmSC8xr
— SVCC (@SVCCofficial) April 8, 2023